పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గతంలో మూడేళ్లు క్రియాశీల రాజకీయాల కోసం కేటాయించి అనంతరం 'వకీల్ సాబ్' రీమేక్ తో మళ్లీ సినిమాల్లో రి రీఎంట్రీ ఇచ్చారు. సినిమాలు, పాలిటిక్స్ కి సమాంతరంగా టైమ్ కేటాయిస్తూ సినిమాలు చేస్తున్నారాయన. ఇటీవల 'భీమ్లానాయక్'తో ప్రేక్షకుల ముందుకొచ్చిన పవన్ కల్యాణ్ సినిమాల పరంగా ప్రస్తుతం వేగం పెంచారు. ఇందులో భాగంగానే ఓ సినిమా సెట్స్ పై వుండగానే మరో రెండు రీమేక్ చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.
ప్రస్తుతం క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్ లో పవన్ కల్యాణ్ 'హరి హర వీరమల్లు' పేరుతో తెరకెక్కుతున్న పీరియాడిక్ చిత్రంలో నటిస్తున్నారు. కరోనాకు ముందు ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైనా ఇప్పటికీ వరుస బ్రేక్ ల కారణంగా ఆలస్యమవుతూ వస్తోంది. తాజాగా ఈ చిత్ర తాజా షెడ్యూల్ ని హైదరాబాద్ లో పద్మశ్రీ తోటతరణి నేతృత్వంలో రూపొందించిన భారీ సెట్ లలో ప్రారంభించారు. ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. పవన్ పాల్గొనగా కీలక పోరాట ఘట్టాలని చిత్రీకరిస్తున్నారు.
నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని జూలై లేదా ఆగస్టు వరకు కంప్లీట్ చేసి ఇదే ఏడాది దసరాకు ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని, ఆ వెంటనే మరో రెండు రీమేక్ చిత్రాలని సెట్స్ పైకి తీసుకెళ్లాలని పవన్ కల్యాణ్ ప్లాన్ చేసుకుంటున్నారట. వాటిని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కుంటున్నారట.
సముద్ర ఖని నటించి డైరెక్ట్ చేసిన 'వినోదాయ సితం' ఇందులో ఒకటి కాగా, మరొకటి విజయ్ నటించిన 'థేరీ' మూవీ మరొకటి. ఈ సినిమాకు 'సాహో' ఫేమ్ సుజీత్ దర్శకత్వం వహించబోతున్నారు.
ఇక వీటితో పాటు హరీష్ శంకర్ 'భవదీయుడు భగత్ సింగ్' కూడా 'హరి హర వీరమల్లు'తో పాటు పూర్తి చేయాలనుకుంటున్నారట. ఉన్నట్టుడి పవన్ ఇలా ఎవరో తరుముతున్నట్టుగా స్పీడు పెంచడానికి కారణం 2024 సార్వత్రిక ఎన్నికలే అని తెలిసింది. 2023 వరకు సినిమాలన్నీ పూర్తి చేసి 2024 ఎలక్షన్స్ కి సిద్ధం కావాలని ప్లాన్ చేసుకుంటున్నారట. పవన్ కల్యాణ్ కుంది ఒక్క ఏడాది మాత్రమే.
ఈ సమయంలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసేసి తన టార్గెట్ రీచ్ అవ్వాలనుకుంటున్నారు. అందుకే వరుసగా సినిమాలు చేసక్తున్నారు.
2024 జనరల్ ఎలక్షన్స్ పవన్ టార్గెట్ 2023 వరకు సినిమాలు చేసి ఆ తరువాత క్రియాశీల రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనాలన్నది పవన్ ప్లాన్. ఆ ప్లాన్ ప్రకారమే ఇప్పడు సినిమాలు చేస్తున్నారు. 2023 తరువాత సినిమాలకు బ్రేక్ ఇవ్వబోతున్నారు. మరింత పక్కా ప్లాన్ తో 2024 ఎలక్షన్స్ కోసం పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని భావిస్తున్నారట. అందులో భాగంగానే సినిమాల విషయంలో పవన్ వేగం పెంచారని వార్తలు వినిపిస్తున్నాయి.