అమ్మ దిల్ రాజు.. గ్లామ‌ర్ గున్నాడ‌నే టార్గెట్ చేస్తున్నార‌ట‌!

Update: 2022-12-16 06:30 GMT
టాలీవుడ్ లో సంక్రాంతి సినిమాల మ‌ధ్య భారీ స్థాయిలో పోటీ నెల‌కొన్న విష‌యం తెలిసిందే. 2023 సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న 'వాల్తేరు వీర‌య్య‌' రిలీజ్ కానుండ‌గా ఈ మూవీకి ఒక్క రోజు ముందు అంటే జ‌న‌వ‌రి 12న నంద‌మూరి బాల‌కృష్ణ న‌టిస్తున్న 'వీర సింహారెడ్డి'' ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ ఇద్ద‌రు సీనియ‌ర్ హీరోలు న‌టిస్తున్న ఈ మూవీస్ కి పోటీగా త‌మిళ హీరో విజ‌య్ న‌టిస్తున్న 'వార‌సుడు' బ‌రిలో దిగ‌బోతోంది.

ఈ మూవీని జ‌న‌వ‌రి 12నే భారీ స్థాయిలో దిల్ రాజు రంగంలోకి దించ‌బోతున్నాడు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్ల‌న్నీ చ‌క చ‌కా పూర్తి చేసేశాడ‌ని, ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లోని కీల‌క థియేట‌ర్ల‌ని ఈ సినిమా కోసం దిల్ రాజ్ బ్లాక్ చేసి త‌న ఆధీనంలో పెట్టుకున్నాడంటూ గ‌త కొన్ని రోజులుగా వ‌రుస క‌థ‌నాలు వినిపిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ విష‌యంలో దిల్ రాజుపై ఇండ‌స్ట్రీకి చెందిన నిర్మాత‌ల మండ‌లి ఇండైరెక్ట్ గా సీరియ‌స్ అయింది కూడా.

ఓ ప్ర‌క‌ట‌నని కూడా విడుద‌ల చేయ‌డం తెలిసిందే. దీనిపై భిన్న వాద‌న‌లు వినిపిస్తున్నా దిల్ రాజు మాత్రం ఇంత వ‌ర‌కు సంక్రాంతి బ‌రిలో దిగుతున్న'వాల్తేరు వీర‌య్య‌', 'వీర సింహారెడ్డి' సినిమాల‌కు సంబంధించిన థియేట‌ర్ల విష‌యంలో రుగుతున్న వివాదంపై స్పందించ‌లేదు. తాజాగా సంక్రాంతి రిలీజ్ ల‌కు టైమ్ ద‌గ్గ‌ర ప‌డుతున్న నేప‌థ్యంలో దిల్ రాజు ఓ మీడియాతో మాట్లాడుతూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది.

త‌మిళంలో విజ‌య్ తో నేను నిర్మించిన 'వారీసు'తో పాటు అజిత్ హీరోగా న‌టించిన సినిమా కూడా త‌మిళ‌నాడులో రిలీజ్ అవుతోంది. అజిత్ తో పోలిస్తే విజ‌య్ అక్క‌డ నెంబ‌ర్ వ‌న్‌ స్టార్‌. అక్క‌డ మొత్తం 800 థియేట‌ర్స్ వున్నాయి. అక్క‌డ విజ‌య్ సినిమాకు 400 థియేట‌ర్స్ మాత్ర‌మే ఇస్తామ‌ని మిగ‌తా 400 థియేట‌ర్ల‌ని అజిత్ సినిమాకు కేటాయిస్తామంటున్నారు. అయితే నేను మాత్రం 450 కావాలని అక్క‌డి వారిని అడుక్కుంటున్నాను.

ఇది వ్యాపారం. అక్క‌డ అజిత్ సినిమాని ఉద‌య‌నిధ స్టాలిన్ రిలీజ్ చేస్తున్నాడు. ఆయ‌న‌నే అడ‌గాల‌ని చెన్నై వెళుతున్నా. ఇక్క‌డ మాత్రం దిల్ రాజు మాత్ర‌మే అంద‌రికి క‌నిపిస్తుంటాడు. నేను గ్లామ‌ర్ గా వుంటాను కాబ‌ట్టే కావ‌చ్చు న‌న్ను టార్గెట్ చేస్తున్నారేమో.

అని చెప్పుకొచ్చాడు దిల్ రాజు. అంటే గ్లామ‌ర్ గా వున్నాడు కాబ‌ట్టే దిల్ రాజుని టాలీవుడ్ ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు టార్గెట్ చేస్తున్నాయా?.. అనేది ఇండ‌స్ట్రీ వ‌ర్గాలే చెప్పాలి అనే కామెంట్ లు వినిపిస్తున్నాయి.   




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News