సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ దాదాపు పుష్కర కాలం తరువాత కలిసి మళ్లీ వర్క్ చేస్తున్నారు. SSMB28 అనే వర్కింట్ టైటిల్ తో రూపొందుతున్న ఈ మూవీని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ ఎస్. రాధాకృష్ణ అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా? అని ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూశారు. ఎట్టకేలకు ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ రెండు వారాల క్రితం మొదలైంది.
సెప్టెంబర్ 12న అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రత్యేకంగా వేసిన సెట్ లో షూటింగ్ ని ప్రారంభించి ఫ్యాన్స్ ఎదురుచూపులకు దెరదించారు. హైవోల్టేజ్యా యాక్షన్ ఘట్టాలతో ప్రారంభమైన ఈ షూటింగ్ మూడు రోజుల తరువాత రామోజీ ఫిల్మ్ సిటీకి మారింది. 'కేజీఎఫ్' సిరీస్ సినిమాలతో పాపులర్ అయిన క్రేజీ ఫైట్ మాస్టర్స్ అన్బు అరివు ల నేతృత్వంలో ఈ యాక్షన్ ఎపిసోడ్ ని దర్శకుడు త్రివిక్రమ్ మొదలు పెట్టారు. మహేష్ తో పాటు పలువురు ఫైటర్స్ పాల్గొనగా కీలక యాక్షన్ ఘట్టాలని చిత్రీకరించారు.
ఇటీవలే ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. దసరా తరువాత మరో షెడ్యూల్ రామోజీ ఫిల్మ్ సిటీలోనే ప్రారంభం కానుంది. అయితే మహేష్ మదర్ ఇందిరా దేవి మృతి కారణంగా ఈ షెడ్యూల్ కాస్త ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. షెడ్యూల్ ప్లానింగ్ కూడా మారుతుందని కూడా తెలుస్తోంది. ఇదిలా వుంటే ఈ మూవీ ప్రారంభం రోజు చిత్ర బృందం #SSMB28Aarambham అనే హ్యాష్ ట్యాగ్ తో సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోని విడుదల చేసింది.
దీంతో ఈ మూవీ టైటిల్ 'ఆరంభం' అని మేకర్స్ ఇండైరెక్ట్ గా చెప్పేశారంటూ ప్రచారం మొదలైంది. సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ కూడా #SSMB28Aarambham హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేయడంతో దాదాపుగా ఇదే టైటిల్ ఫైనల్ అని అంతా ఫిక్సయ్యారు. దీనిపై చిత్ర బృందం స్పందించలేదు.. టైటిల్ పై జరుగుతున్న ప్రచారాన్నిపెద్దగా పట్టించుకోలేదు కూడా. అయితే తాజాగా ఈ మూవీకి ఆ టైటిల్ ని మేకర్స్ కన్ఫమ్ చేయలేదని, అలాంటి ఆలోచన కూడా వారికి లేదని తెలిసింది.
అయితే ఈ మూవీకి త్రివిక్రమ్ తన సెంటిమెంట్ ని ఫాలో అవుతూ అత్తారింటికి దారేది, అరవింద సమేత, అల వైకుంఠపురములో.. తరహాలో కొత్తగా వుండేలా టైటిల్ ని పెట్టబోతున్నారట. తాజాగా సమచారం ప్రకారం ఈ మూవీకి 'అయోధ్యలో అర్జునుడు' అనే టైటిల్ ని త్రివిక్రమ్ ఫైనల్ చేసే అవకాశం వుందని ఇన్ సైడ్ టాక్. అత్తారింటికి దారేది' మూవీ నుంచి తన సినిమాలకు కొత్త తరహా టైటిల్స్ ని సెంటిమెంట్ గా కంటిన్యూ చేస్తున్నారు. అదే సెంటిమెంట్ ప్రకారం మహేష్ SSMB28 కి కొత్త టైటిల్ ని ఫైనల్ చేసే అవకాశం వుందని తెలుస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.