`వ‌కీల్ సాబ్` గాయం టాలీవుడ్ ని ఇంకా వెంటాడుతోందా?`

Update: 2021-07-19 06:36 GMT
స‌రిగ్గా క‌రోనా వైర‌స్ సెకండ్ వేవ్ ఎంట్రీ ఇస్తున్న స‌మ‌యమ‌ది.. 9 ఏప్రిల్ మండే ఎండ‌ల్లో రిలీజైంది వ‌కీల్ సాబ్. రాంగ్ టైమింగ్ తో రిలీజైనా కానీ తొలి రెండు మూడు రోజులు అద్భుత వ‌సూళ్ల‌తో అద‌ర‌గొట్టింది. సినిమాకి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ రావ‌డంతో బాగా ఆడేస్తుంద‌ని అంతా భావించారు. కానీ ఇంత‌లోనే మ‌హమ్మారీ క‌ల్లోలం వ‌చ్చే జ‌నాల్ని భ‌య‌పెట్టింది. థియేట‌ర్ల వైపు రానివ్వ‌కుండా చేసింది. దీనికి తోడు ఏపీలో టిక్కెట్టు రేట్లు త‌గ్గిస్తూ జ‌గ‌న్ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యంతో అక్క‌డ థియేట‌ర్లు మూసేశారు. వ‌రుస క‌ల్లోలాలు వ‌కీల్ సాబ్ పై బిగ్ పంచ్ వేశారు. కొంత న‌ష్టం వ‌చ్చినా కానీ తాము ఆశించిన వ‌సూళ్లు ద‌క్కాయ‌ని నిర్మాత దిల్ రాజు వివ‌ర‌ణ ఇవ్వ‌డం మ‌రో ట్విస్టు.

అన్న‌ట్టు వ‌కీల్ సాబ్ అనుభ‌వం.. ఇప్ప‌టికీ టాలీవుడ్ నిర్మాత‌ల‌ను వెంటాడుతోంది. ఏపీలో టిక్కెట్టు ధ‌ర‌లు పెంచాల‌ని క్రైసిస్ కాలంలో ప‌న్నులు క‌రెంటు బిల్లులు నిషేధించి థియేట‌ర్ య‌జ‌మానుల‌ను ఆదుకోవాల‌ని డిమాండ్ ఊపందుకుంది. కానీ దానికి ప్ర‌భుత్వాల నుంచి స్పంద‌న లేదు. బ‌డా నిర్మాత‌ల ప్ర‌కారం ఇప్పుడ‌ప్పుడే జ‌నాలు థియేట‌ర్ల‌కి వ‌చ్చే అవ‌కాశాలు క‌నిపించ‌డం లేదు. దానికి అంతా వ‌కీల్ సాబ్ నే ఉదాహార‌ణగా చూపుతున్నారు. అంతటి క్రేజీ సినిమాకి కూడా మండే నుంచి క‌లెక్ష‌న్లు ప‌డిపోవ‌డం ఏమిటో అర్థం కాలేదు.. అస‌లు కార‌ణం ఏమై ఉంటుంద‌ని ప్ర‌శ్నిస్తున్నారు. మినిమం గ్యారంటీ హీరోల సినిమాలు క‌నీసం మూడు వారాలు క‌నీస వ‌సూళ్లు రాబ‌డితేనే నిర్మాత‌లు.. కొనుకున్న వాళ్లు ప్రాఫిట్స్ లోకి వెళ్లే అవ‌కాశం ఉంద‌ని వారు అంటున్నారు. మునుముందు థ‌ర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉన్నందున సినిమాలు మూడు వారాలు ఆడే సీన్ ఉంటుందా? ఇలాంట్పుడు సినిమాల్ని రిలీజ్ చేయాలా వ‌ద్దా? అన్న సందిగ్ధం అలానే ఉంది. ఓవ‌రాల్ గా వ‌కీల్ సాబ్ ఇంపాక్ట్ చాలానే ప‌డింది.

కార‌ణం ఏదైనా.. ఇప్పుడున్న ప‌రిస్థితుల రీత్యా మొద‌టి వారంలో మొద‌టి మూడు రోజులు కూడా హాళ్లు నిండే అవ‌కాశం లేదని ఈ పరిస్థితుల్లో ఓటిటి రిలీజులే బెట‌ర్ అనే కామెంట్స్ ఇప్పుడు ఇండ‌స్ట్రీలో బాగా వినిపిస్తున్నాయి.
Tags:    

Similar News