గత ఏడాది డిసెంబర్ లో అంతరిక్షం తీవ్రంగా నిరాశపరిచినా కేవలం నెల రోజుల గ్యాప్ లో ఎఫ్2 లాంటి ఇండస్ట్రీ హిట్ ని ఖాతాలో వేసుకున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం వాల్మీకిలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. షూటింగ్ ముప్పాతిక శాతం పూర్తయ్యింది. రాయలసీమతో పాటు హైదరాబాద్ లో సమాంతరంగా పని కానిస్తున్న దర్శకుడు హరీష్ శంకర్ ఒరిజినల్ వెర్షన్ జిగర్ తండ కంటే బెటర్ గా వచ్చేలా చాలా మార్పులే చేసాడట.
దీని తర్వాత వరుణ్ తేజ్ ఏ మూవీ చేస్తాడనే ఆసక్తి అభిమానుల్లో ఉంది. వాస్తవానికి వాల్మీకి కన్నా ముందు వరుణ్ ఒప్పుకున్నది కిరణ్ అనే కొత్త దర్శకుడి సినిమా. బాక్సింగ్ నేపథ్యంలో రూపొందే ఆ ప్రాజెక్ట్ కోసమే ప్రత్యేకంగా యుఎస్ వెళ్లి ట్రయినింగ్ కూడా తీసుకుని వచ్చాడు. శరీరంలో ఆ మార్పు వాల్మీకికి కూడా ఉపయోగపడింది తాజా అప్ డేట్ తేజా ప్రకారం ఇప్పుడీ కిరణ్ సినిమాను వరుణ్ తేజ్ పెండింగ్ లో పెట్టబోతున్నట్టు తెలిసింది.
అధికారిక సమాచారం కాదు కానీ లీకైన న్యూస్ అదే చెబుతున్నాయి. వాల్మీకి తర్వాత రిలీజయ్యే సినిమా కాబట్టి రెండు రఫ్ క్యారెక్టర్స్ ని వరసగా చేస్తే ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటారో లేదో అన్న అనుమానంతో కొన్నాళ్ళు ఆగుదామని చెప్పాడట. కిరణ్ కు ఇది మొదటి సినిమా కావడంతో పక్కా స్క్రిప్ట్ ని సిద్ధం చేసుకుని ఉంచాడు. బాక్సర్ బ్యాక్ డ్రాప్ కాబట్టి ఎవరితో బడితే వాళ్ళతో తీయడానికి ఉండదు. మరి కిరణ్ కొత్త కథ ఏమైనా చెబుతాడా లేక ఇంకేదైనా ప్లానింగ్ జరుగుతుందా వేచి చూడాలి.