మూస కథలతో ఫక్తు కమర్షియల్ సినిమాలు తీస్తే తెలుగు ప్రేక్షకులు తిరస్కరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రోజుల్లో కథ, కథనంలో కొత్తదనం లేనిదే గ్రిప్పింగ్ నేరేషన్ లేనిదే సినిమాలు హిట్టవ్వడం కష్టంగా మారింది. మాస్ ఫార్ములాతో థియేటర్లకు జనాల్ని రప్పించేయాలని భావించినా .. లాజిక్ మిస్సయితే తిరస్కరిస్తున్నారనడానికి ఇటీవల కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. అయితే వీటన్నిటికీ దూరంగానే హరీష్ శంకర్ `వాల్మీకి`ని కొత్తగా తీస్తున్నాడా? అంటూ అభిమానుల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకుడిగా హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న వాల్మీకి కథాంశం ఏంటి? అంటే ఇది తమిళ బ్లాక్ బస్టర్ `జిగర్తాండ` స్ఫూర్తితో తీస్తున్న సినిమా అని చెప్పుకుంటున్నారు. సిద్ధార్థ కథనాయకుడిగా కార్తీక్ సుబ్బరాజు ఆ సినిమాని తెరకెక్కించారు. జిగర్తాండ గ్యాంగ్ స్టర్ నేపథ్యం .. వాల్మీకిలోనూ ఉండడంతో అదే కథ అని ప్రచారమవుతోంది. అయితే ఇది ఒరిజినల్ స్క్రిప్టునా కాదా? అన్నదానికి హరీష్ ఇంతవరకూ వివరణ ఇవ్వలేదు.
ఇకపోతే `వాల్మీకి` అనే టైటిల్ కి తెలుగు ఆడియెన్ నుంచి అద్భుత స్పందన వచ్చింది. వరుణ్ తేజ్ లాంటి ఒడ్డు పొడవు ఉన్న హీరోని గ్యాంగ్ స్టర్ గా చూడాలని అభిమానులు భావిస్తున్నారు. టైటిల్ కి తగ్గట్టే సినిమాలో ఘాడమైన ముద్ర వేసే ఎలిమెంట్స్ ఉంటాయా? అన్నది వేచి చూడాలి. ఇక ఫక్తు కమర్షియల్ ఫార్ములాతో సినిమాలు తీయడం హరీష్ శంకర్ అలవాటు. హరీష్ దర్శకత్వంలో గతంలో వచ్చిన మిరపకాయ్, సుబ్రమణ్యం ఫర్ సేల్ వంటి చిత్రాలు ఆ తరహానే. అయితే హరీష్ ఈసారి జోనర్ మార్పుతో వస్తున్నాడా? సంక్రాంతి బరిలో వచ్చిన `వినయ విధేయ రామ` రిజల్ట్ ఏంటో తెలిసిందే. పాత మూస మాస్ ఫార్ములాలో తీసిన బోయపాటికి తగిన గుణపాఠం చెప్పిన తెలుగు ప్రేక్షకుల మైండ్ సెట్ ఏంటో అందరికీ అర్థమైంది. ఇక వాల్మీకి చిత్రంతో హరీష్ అలాంటి తప్పు చేయడు కదా? అన్న ముచ్చటా మెగాభిమానుల్లో సాగుతోంది. నేడు హరీష్ శంకర్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు.