రానా మరియు విష్ణు విశాల్ ప్రధాన పాత్రల్లో నటించిన 'అరణ్య' పాన్ ఇండియా లెవల్ లో మొన్న శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యూనివర్శిల్ సబ్జెక్ట్ అవ్వడం వల్ల అన్ని భాషల్లో కూడా అరణ్య సినిమా మంచి వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని యూనిట్ సభ్యులు నమ్మకం పెట్టుకున్నారు. రానాకు తెలుగు తో తమిళం మరియు హిందీలో కూడా గుర్తింపు ఉంది. ఆ కారనం వల్ల కూడా అరణ్య సినిమా కు అక్కడ బిజినెస్ అయితే అయ్యింది. కాని ఓపెనింగ్స్ మాత్రం దారుణంగా ఉన్నాయి. సినిమా మొత్తంగా కనీసం మూడు కోట్ల రూపాయలను కూడా రాబట్టలేక పోయింది.
స్లో అండ్ స్టడీ అన్నట్లుగా ఉన్న అరణ్య సినిమాను ప్రేక్షకులు మరియు రివ్యూవర్స్ ప్రశసంసిస్తున్నారు. కాని వసూళ్లు మాత్రం రావడం లేదు. రానా ఇలాంటి సినిమాను చేసేందుకు కమిట్ అవ్వడం నిజంగా అభినందనీయం అంటు ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాని ఇలాంటి సినిమాలను కమర్షియల్ యాంగిల్ లో తీయాలనుకోవడం భారీ వసూళ్లు వస్తాయని ఆశించడం అత్యాశే అవుతుంది. ఈ సినిమా విషయంలో అదే జరిగిందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం అవుతుంది. సినిమా నిరాశ పర్చినా కూడా ఖచ్చితంగా మినిమం వసూళ్లు అనేవి నమోదు అవుతాయని భావించారు. కాని ఈ సినిమా మరీ దారునంగా రూ.2.5 కోట్ల వద్దే ఆగిపోవడం అందరికి పెద్ద షాకింగ్ గా ఉంది. రానా తర్వాత సినిమా విరాటపర్వం ఎలా ఉంటుందో చూడాలి.