RRR సినిమా జపాన్ రిలీజ్ సందర్భంగా చిత్రయూనిట్ అక్కడకు వెళ్లి ప్రమోషన్స్ చేస్తుంది. ఎన్.టి.ఆర్, చరణ్, రాజమౌళి ముగ్గురు కలిసి జపాన్ మీడియాలో సందడి చేస్తున్నారు. మన తెలుగు హీరోల గురించి జపాన్ మీడియాలో కవరేజ్ చూసి అభిమానులు ఫుల్ జోష్ గా ఉన్నారు. ఇక ఈ ప్రమోషన్స్ లో భాగంగా జపాన్ లో పాపులర్ ఛానెల్ అయిన టోక్యో MX1 ఛానెల్ లో స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు ఆర్.ఆర్.ఆర్ టీం.
ఈ ఇంటర్వ్యూలో భాగంగా అక్కడ వారితో కలిసి నాటు నాటు సాంగ్ కి డ్యాన్స్ కూడా వేశారు ఎన్.టి.ఆర్, చరణ్. ఇదే సందర్భంగా డ్యాన్స్ గురించి ఎన్.టి.ఆర్ అద్భుతమైన వివరణ ఇచ్చారు. భారతీయ సంప్రదాయంలో డ్యాన్స్ అనేది ఒక భాగమని. సంతోషం, బాధ, కోపం, విజయం ఇలా ఎమోషన్ ఏదైనా సరే డ్యాన్స్ తో అది చెప్పగలుగుతామని అన్నారు.
ఇండియాలో ఉన్న 29 రాష్ట్రాల్లో ప్రత్యేకమైన డ్యాన్స్ ఫామ్స్ఉన్నాయని భారతీయ శాస్త్రీయ నృత్య కళల గురించి చెప్పారు ఎన్.టి.ఆర్. డ్యాన్స్ తోనే భావాన్ని వ్యక్తీకరిస్తాం.. డ్యాన్స్ తోనే డ్రామా చూపిస్తాం అంటూ డ్యాన్స్ గురించి సూపర్ స్పీచ్ ఇచ్చారు ఎన్.టి.ఆర్.
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ చిన్నప్పుడే కూచిపూడి నేర్చుకున్నాడని తెలిసిందే. అందుకే తారక్ డ్యాన్స్ ఓ రేంజ్ లో ఉంటుంది. టాలీవుడ్ డ్యాన్సింగ్ స్టార్స్ లో ఎన్.టి.ఆర్, రాం చరణ్, అల్లు అర్జున్ లు ఉంటారు.
నాటు నాటు సాంగ్ ని రాజమౌళి ప్రత్యేకంగా ప్లాన్ చేశారని ఈ సాంగ్ పర్ఫెక్షన్ కోసం ఎన్నో టేకులు తీసుకున్నామని ఎన్.టి.ఆర్ అప్పట్లో చెప్పారు. అంత రిస్క్ తీసుకున్నారు కాబట్టే నాటు నాటు సాంగ్ ఎఫెక్ట్ జపాన్ దాకా వెళ్లింది. RRR సినిమా లో కొమరం భీమ్ పాత్రలో ఎన్.టి.ఆర్ తన నటనతో మరోసారి మెస్మరైజ్ చేయగా.. రామ రాజు పాత్రలో రాం చరణ్ కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.