ఆ హీరోయిన్ మొగుడిపై ఐటి రైడ్స్

Update: 2017-04-07 09:28 GMT
ఇప్పుడు తమిళనాట పెను సంచలనాలు చోటు చేసుకుంటున్నాయి. అసలు ఏం జరుగుతుందో ఊహించేలోపే.. చాలామంది సినిమా వారికి ఆదాయపు పన్ను శాఖ వారు పంచ్ లు ఇస్తున్నారు. అదిగో ముఖ్యంగా ఒక వర్గానికి చెందిన వారిపై దాడులు భయంకరంగా జరుగుతున్నాయంటూ టాక్ వినిపిస్తోంది.

పాపులర్ హీరోయిన్ రాధిక మొగుడు శరత్ కుమార్ ఇప్పుడు ఐటి శాఖ టార్గెట్ గా మారిపోయాడు. ముఖ్యంగా ఆర్కె నగర్ లో రేపు 12వ తారీఖున ఉప ఎన్నిక ఉండటంతో.. ఇప్పుడు చెన్నయ్ లో వాతావరణం వేడెక్కేసింది. ఈ సమయంలో అక్కడి ఆరోగ్య శాఖ మంత్రి సి.విజయ్ భాస్కర్ ఇంటిపై.. ఆయన చుట్టాల ఇళ్ళపై.. అలాగే నటుడు శరత్ కుమార్ ఇంటిపై ఆదాయపు పన్ను శాఖ దాడులు చేయడం ఆసక్తికరంగా మారింది. ఎన్నికల్లో పంచడానికి డబ్బు కలిగియున్నారనే ఇన్ఫర్మేషన్ ఉండటంతోనే వీరిపై దాడులు జరుగుతున్నట్లు చెబుతున్నారు.

ఏదేమైనా కూడా ఎలక్షన్ల సమయంలో తమిళనాడులో ఇలా సెలబ్రిటీలపై దాడులు జరుగడం ఇదేం కొత్త కాదులే. అయితే ఒకవేళ డబ్బు నిజంగానే దొరికితే మాత్రం నీతి నిజాయితీల గురించి క్లాసులు పీకే ఈ సెలబ్రిటీలు ఏం సమాధానం చెబుతారనేదే ప్రశ్న.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News