రాజమౌళి కెరీర్ తక్కువ ప్రాఫిట్ అందించిన సినిమా అదే!

Update: 2022-10-10 15:30 GMT
దేశవ్యాప్తంగానే కూడా ఇప్పుడు సినిమా లవర్స్ అందరి ఫోకస్ ఎక్కువగా రాజమౌళి పైన ఉంది. చాలామంది హాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా RRR సినిమాను చూసి ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. రాజమౌళి గురించి సోషల్ మీడియాలో కూడా అనేక రకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఇక ఈ దర్శకుడు ఎవరు అనే విషయం పెద్దగా తెలియని వారు కూడా అతని గత సినిమాల బాక్స్ ఆఫీస్ ట్రాక్ గురించి సెర్చ్ చేస్తూ ఉండడం విశేషం.

ఇక నేడు రాజమౌళి పుట్టినరోజు సందర్భంగా రాజమౌళికి సంబంధించిన చాలా రకాల విషయాలు వైరల్ గా మారుతున్నాయి. అయితే రాజమౌళి తెలుగులో ప్రతి సినిమా కూడా దాదాపు పెట్టిన పెట్టుబడికి డబుల్ ప్రాఫిట్ అందించింది. అయితే ఒకే ఒక సినిమా మాత్రం కేవలం యావరేజ్ టాక్ అందుకుంది. అంతే కాకుండా ఆ సినిమాకు పెట్టిన పెట్టుబడి అయితే డబుల్ ప్రాఫిట్ అయితే ఏమీ అందించలేదు.

అలాగే కొన్ని ఏరియాల్లో కొందరు డిస్ట్రిబ్యూటర్లు నష్టపోయినట్లు కూడా అప్పట్లో ఒక టాక్ వచ్చింది. ఆ సినిమా మరేదో కాదు. హీరో నితిన్ తో చేసిన సై. అప్పటివరకు ఇండియాలో పెద్దగా తెలియని రగ్బీ సినిమా ఆట ఆధారంగా ఆ సినిమాను తెరపైకి తీసుకొచ్చారు. యాక్షన్ మూవీగా ఆ సినిమాకు ఇప్పటికీ కూడా కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. కొన్ని సన్నివేశాలు అలాగే భిక్షుయాదవ్ గా ప్రదీప్ రావత్ కనిపించిన విధానం ఓ వర్గం ప్రేక్షకులను ఎంతగానో కట్టుకుంటుంది.

ఇక సినిమాను ఏ భారతి నిర్మించగా.. సై కోసం దాదాపు 5 నుంచి 6 కోట్ల వరకు బడ్జెట్ అయితే ఖర్చు చేశారట. ఇక బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం తొమ్మిది కోట్ల వరకు మాత్రమే కలెక్షన్స్ అందుకున్నట్లు అప్పట్లో ఇండస్ట్రీలో ఒక టాక్ వినిపించింది.

నిర్మాత కూడా ఒక ఇంటర్వ్యూలో రాజమౌళి రేంజ్ లో అయితే కలెక్షన్స్ ఏమి రాలేదు అని పెట్టిన పెట్టుబడికి కొంత లాభం వచ్చింది అని అన్నారు. ఏదేమైనప్పటికీ సై సినిమా మాత్రం రాజమౌళి కెరీర్ లో అతి తక్కువ బాక్సాఫీస్ కలెక్షన్స్ అందుకున్న సినిమా. కానీ కంటెంట్ పరంగా మాత్రం ఈ సినిమా చాలా డిఫరెంట్ అని చెప్పవచ్చు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News