మనిషికి బ్రతుకుపై ఒక ఆశ ఉండాలి .. ఆ ఆశను నెరవేర్చుకోవాలనే ఆశయం ఉండాలి. అప్పుడే అడుగులు ముందుకు పడతాయి. గెలుపు గుమ్మంలోకి తీసుకుని వెళతాయి. అయితే ఎవరూ కూడా కష్టపడకుండా ఏమీ సాధించలేరు. ప్రతి ఒక్కరి విజయం వెనుక అనేక అవమానాలు .. పరాజయాలు ఉంటాయి. అయితే ఆ చివరలో వచ్చే సక్సెస్ మాత్రమే అందరికీ కనిపిస్తుంది. అది పొందినవారికి వారికి ఆనందాన్నిస్తుంది .. చూసేవారిలో కొందరికైనా ఆదర్శంగా నిలుస్తుంది. అలా జీవితం పట్ల ఒక ఆశతో అడుగులు వేసి, తాను అనుకున్న స్థాయికి చేరుకున్న హీరోగా శివకార్తికేయన్ కనిపిస్తాడు.
నటుడిగా శివకార్తికేయన్ తన ప్రయాణాన్ని మొదలుపెట్టి పదేళ్లు పూర్తయ్యాయి. బుల్లితెరపై తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఆయన, దిశను మార్చుకున్న తుపాను మాదిరిగా వెండితెర వైపు వచ్చాడు. 2012లో తొలిసారిగా ఆయన పాండిరాజ్ దర్శకత్వంలో నటించాడు. చెన్నైకి ఒక వైపున సముద్రం ఉన్నట్టు మరో వైపున కమల్ .. రజనీ ఉన్నారు. ఇక విజయ్ .. అజిత్ వంటి స్టార్ హీరోలు బరిలో ఉన్నారు.
తమదైన ప్రత్యేకతను చాటుతూ దూసుకుపోతున్న విక్రమ్ .. సూర్య .. కార్తి ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి రావడమనేది, ఒంటె .. వాటర్ బాటిల్ లేకుండా ఎడారిలో ప్రయాణం చేయడం లాంటిది.
అయినా శివ కార్తికేయన్ తన బాడీ లాంగ్వేజ్ కి తగిన కథలను .. పాత్రలను ఒప్పుకుంటూ ముందుకు వెళ్లాడు. ధైర్యంతో ఆయన తీసుకున్న నిర్ణయాలు .. 'రెమో' వంటి ప్రయోగాలు ఫలించాయి. అలా ఒక్కో మెట్టూ ఎక్కుతూ స్టార్ డమ్ సంపాదించుకున్నాడు. 'డాక్టర్' వంటి సినిమాతో నిర్మాతగాను భారీ సక్సెస్ చూశాడు. అలాంటి శివకార్తికేయన్ తన పదేళ్ల జర్నీని గుర్తుచేసుకున్నాడు. తన ఈ ప్రయాణంలో మొదటి సినిమాతో తనని ప్రోత్సహించిన దర్శకుడు పాండిరాజ్ నుంచి ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్ చెప్పాడు. వాళ్లు చేసిన సాయాన్ని మరిచిపోలేనని అన్నాడు.
"ఈ ప్రయాణంలో నా తోటి ఆర్టిస్టులు ఎంతో సహకరించారు .. సీనియర్స్ వెన్నుతట్టారు .. దర్శక నిర్మాతలు నాపై నమ్మకంతో అవకాశాలు ఇచ్చారు. నా సినిమాలు జనానికి చేరువ కావడానికి మీడియా ఎంతో హెల్ప్ చేసింది. నేను హిట్ కొట్టినప్పుడు కేరింతలు కొట్టిన అభిమానులు, ఫ్లాపులు వచ్చినప్పుడు అండగా నిలిచారు. ముఖ్యంగా తమిళ ప్రేక్షకులు నన్ను ఒక కొడుకుగా .. సోదరుడిగా భావించి ఆదరించారు. అందువలన వాళ్లందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను" అని చెప్పుకొచ్చాడు. ఇక శివ కార్తికేయన్ తాజా చిత్రమైన 'డాన్' మార్చి 25వ తేదీన థియేటర్లకు రానుంది.