జబర్దస్త్ కామెడీ షోలో ఎప్పుడైతే చమ్మక్ చంద్ర చీరకట్టి స్కిట్ కొట్టాడో అప్పటి నుండి అన్ని టీం లు కూడా లేడీ గెటప్స్ తో నవ్వించే ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పటి వరకు టీం లీడర్స్ లో ఆది తప్ప మిగిలిన అంతా కూడా అమ్మాయి, ఆంటీ వేశం వేసి నవ్వించే ప్రయత్నం చేశారు. ఇక కొంత మంది కమెడియన్స్ కేవలం లేడీ పాత్రలకే పరిమితం అవుతున్నారు. వారు రియల్ లుక్ లో వచ్చినా కూడా గుర్తు పట్టే పరిస్థితి లేదు. వారిలో ముఖ్యమైన వారు వినోద్, శాంతి స్వరూప్, సాయితేజలు పూర్తిగా లేడీ గెటప్స్ లోనే కనిపిస్తూ ఉన్నారు.
ఇతరుల విషయం పక్కన పెడితే సాయి తేజ నిజంగానే అమ్మాయిగా మారిపోయాడు. తాజాగా లింగమార్పిడి చేయించుకుని మరీ మీడియా ముందుకు వచ్చాడు. తాను మొన్నటి వరకు అబ్బాయిని, ఇప్పుడు అమ్మాయిని అంటూ స్వయంగా ప్రకటించాడు. చిన్నప్పటి నుండి కూడా నాలో విభిన్నమైన ఆలోచనలు ఉండేవని, ఇంట్లో ఎవరు లేని సమయంలో అమ్మాయి డ్రస్ లు వేసుకుని సంతోషించేవాడిని, జబర్దస్త్ లో ఎప్పుడైతే అవకాశం వచ్చిందో, లేడీ గెటప్ లు వేసే ఛాన్స్ రాగానే చాలా సంతోషించాను.
ఇన్నాళ్లు కుటుంబం పరువు పోతుందని, ఇంట్లో వారు ఏమంటారో అనుకుని మగాడిగా ఉన్నాను. కాని ప్రస్తుతం నాకంటూ ఒక సొంత భవిష్యత్తు ఉంది, దాన్ని నేను అనుకున్నట్లుగా సాగించుకోవాలనే ఉద్దేశ్యంతో అమ్మాయిగా మారిపోయాను అంటూ సాయి తేజ చెప్పుకొచ్చాడు. కొన్నాళ్ల క్రితం నా ఆరోగ్యం చాలా సీరియస్ గా మారింది. ఆ సమయంలో నేను ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో నెలల తరబడి బెడ్ కే పరిమితం అయ్యాను అంటూ చెప్పుకొచ్చాడు. జనాలు అంతా ఏమనుకుంటారో, ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే ఉద్దేశ్యంతో నేను ఇంత కాలం ఈ విషయాన్ని దాచి పెట్టాను. ఇప్పుడు మీడియా ముందుకు వచ్చిన నేపథ్యంలో జనాల రియాక్షన్ ఎలా ఉంటుందో అనేది చూడాలి అంటూ ఒక ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సాయి తేజ చెప్పుకొచ్చాడు.