డీమానిటైజేషన్ మీద రామ్ గోపాల్ వర్మ చేసిన కమెంట్లు హాట్ టాపిక్ అయిపోతున్నాయి. అలాగే మనోడు పవన్ కళ్యాణ్ గురించి ఏం సెటైర్లు వేసినా కూడా అది టాక్ ఆఫ్ ది టౌన్ అవుతోంది. కాని తన సొంత సినిమాలను ప్రమోట్ చేసుకుందాం అని మనోడు ఎంత ప్రయత్నించినా కూడా అది వర్కవుట్ కావట్లేదు.
అదిగో మొన్నక రోజున రాము తన సినిమాలోని ఒక గ్యాంగ్ స్టర్ తో ఒక ఫోటో పెట్టాడు. ఆ ఫోటో గురించి అసలు మీడియా వారెవ్వరూ చర్చించకపోవడం చాలా విడ్డూరంగా ఉంది. త్వరలోనే ''సర్కార్ 3'' సినిమాతో మన ముందుకొస్తున్నాడు వర్మ. అయితే ఆ సినిమాలో అమితాబ్ బచ్చన్ మాత్రమే కాకుండా అత్యంత స్టెల్లార్ స్టార్ క్యాస్ట్ ఉంది. అందులో జాకీ ష్రాఫ్ కూడా ఉన్నాడు. మనోడు అరుణ్ గవ్లీ అనే ఒక మాఫియా డాన్ పాత్రను పోషిస్తున్నాడు. ఆ షూటింగ్ పూణె దగ్గర్లోని ఆర్దర్ రోడ్ జైల్లో జరుగుతోంది. ఈ సందర్భంగా అక్కడ నుండి ఒక ఫోటో దిగి పెట్టినా కూడా.. అసలు రామును ఎవరైనా పట్టించుకుంటే ఒట్టు.
అంతే కదండీ.. మనోడు చేసే సంచలన ప్రకటనలన్నీ కూడా.. సంచలనాత్మకమైన వ్యక్తుల గురించి లేదంటే విషయాల గురించి. వాటి మీద మాట్లాడినప్పుడు సదరు ఒపీనియన్ ఫ్యామస్ అవుతుంది కాని.. తను ఫ్లాప్ సినిమాలే తీస్తున్నప్పుడు తన సినిమాల గురించి ఎంత మాట్లాడినా కూడా అది ఫేమస్ అవ్వదు. అది సంగతి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/