బతికి చెడ్డవారు చాలా మందే ఉంటారు. సినిమా ఇండస్ట్రీలో కూడా అలాంటి వాళ్లకు కొదవలేదు. ఒకనాడు కరెన్సీ కట్టలపై పడుకున్నవారు.. బ్యాడ్ పొజిషన్లో కటిక నేలపై కూడా పడుకోవాల్సి వస్తుంది. అయితే.. మిగిలిన జీవితం మొత్తాన్ని ఇలా కష్టాల్లోనే గడిపేసేవారు కొందరైతే.. తిరిగి పూర్వ వైభవం సాధించేవారు మరికొందరు. అలాంటి వారిలో ఒకరు బాలీవుడ్ స్టార్ యాక్టర్ జాకీ ష్రాఫ్. తన జీవితంలో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల గురించి తాజాగా ఆయన మీడియాతో షేర్ చేసుకున్నారు.
ఇవాళ క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిపోయారుగానీ.. ఇరవై ఏళ్లకు ముందు జాకీ స్టార్ హీరోనే. స్టార్ డమ్ విషయంలోనే కాకుండా.. ఆర్థికంగా కూడా ఎంతో ఎత్తుకు ఎదిగారు జాకీ. అయితే.. ఆ తర్వాత బిజినెస్ మెన్ గా మారారు. కానీ.. అక్కడ కలిసి రాలేదు. నటుడిగా ఉచ్ఛస్థితికి చేరుకున్న ఆయన.. వ్యాపారంలోకి దిగిన తర్వాత పాతాళానికి పడిపోయారు.
పరిస్థితి ఎలా మారిందంటే.. ఏకంగా ఉన్న ఇంటిని కూడా అమ్మేయాల్సి వచ్చిందట. ఆర్థిక సమస్యలను తట్టుకోలేక తీవ్రంగా ఇబ్బంది పడ్డారట. ''ఏదో చేయాలనుకున్నాను. ఏదో జరిగింది. ప్రతిసారీ మంచే జరగదు కదా. కొన్నిసార్లు కింద పడతాం. మరికొన్ని సార్లు పైకి ఎగురుతాం'' అని అన్నారు జాకీ.
అయితే.. ఇప్పుడు ఆయన అంతా సేఫ్. ఆర్థికంగా తిరిగి పూర్వ స్థితికి చేరుకున్నారు. ఇందులో తన కొడుకు టైగర్ ష్రాఫ్ పాత్ర ఎంతో ఉందంటాడు జాకీ. అప్పుల్లో పోయిన ఇంటిని తిరిగి తన కొడుకే బహుమతి ఇచ్చాడని, ఇందుకోసం చాలా కష్టపడ్డాడని చెప్పాడు. అనుకున్నది సాధించే వరకూ తన కొడుకు వదిలి పెట్టడని, తన కుమారున్ని చూస్తే ముచ్చటేస్తుందని హ్యాపీగా ఫీలవుతున్నాడు జాకీ ష్రాఫ్.