కండల హీరో కోసం పాపల కొట్లాట

Update: 2015-04-13 04:55 GMT
బాలీవుడ్‌ స్టార్‌ హీరో, కండరగండడు సల్మాన్‌ఖాన్‌ కోసం ఇద్దరమ్మాయిలు కొట్టుకోవడం బాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. ఒక సీనియర్‌ బ్యాచిలర్‌ కోసం.. అతడి సరసన అవకాశం కోసం ఈ భామలు కొట్టుకోవడం సంచలనమే అవుతోంది.

వివరాల్లోకి వెళితే.. సల్మాన్‌ ప్రస్తుతం కరణ్‌జోహర్‌ దర్శకత్వంలో 'శుద్ధి' అనే చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నాడు. సల్మాన్‌ సరసన కథానాయిక కోసం వెతుకుతున్నారు. అయితే ఈ అవకాశం కోసం ముకుపుడకల సోయగం సోనాక్షి సిన్హా, శ్రీలంకన్‌ బ్యూటీ జాక్విలిన్‌ ఫెర్నాండెజ్‌ పోటీపడుతున్నారని  సమాచారం. సల్లూ భాయ్‌ని వదిలిపెట్టడం ఈ ఇద్దరు భామలకు ఇష్టం లేదుట. దబాంగ్‌తో సోనాక్షికి తొలి అవకాశం ఇచ్చాడు. అలాగే జాక్విలిన్‌ కెరీర్‌ అయిపోయింది అనుకున్నప్పుడు ఓ ఛాన్సిచ్చి ఆదుకున్నాడు. అందుకే మరోసారి సల్లూ భాయ్‌ కావాలని ఈ ఇద్దరూ బలంగా కోరుకుంటున్నారు.

గఆ ప్రయత్నంలోనే ఇద్దరిమధ్యా కోల్డ్‌వార్‌ నడుస్తోందని బాలీవుడ్‌లో ప్రచారమవుతోంది. అయితే ఇదే ప్రశ్న సల్మాన్‌ని అడిగితే.. అలాంటిదేం లేదు. ఈ ఇద్దరిమధ్యా వార్‌ నడుస్తున్న సంగతి నాకు తెలియనే తెలీదు. ఇప్పటికే కొందరితో చర్చలు సాగిస్తున్నాం. కథానాయిక ఎవరన్నది ఇంకా ఫైనల్‌ కాలేదు. అవకాశం ఎవరిని వరిస్తుందో ఇప్పుడే చెప్పలేను అని అంటున్నాడు.
Tags:    

Similar News