అతడి వలన జీవితం నాశనం.. బాలీవుడ్ బ్యూటీ

Update: 2023-01-19 03:52 GMT
బాలీవుడ్ లో చాలా మంది హీరోయిన్స్ ఎవరితో రిలేషన్ పెట్టుకోవడం వలన తెలియకుండా అవతలి వారు చేసిన తప్పులలో భాగం కావాల్సి వస్తుంది. అలాగే ఏదో ఒక సమయంలో వారు చేసిన తప్పుల కారణంగా అకారణంగా నిందలు మోయడంతో పాటు జైలు జీవితం కూడా గడపాల్సి వస్తుంది.

అలాంటి వారిలో చాలా మంది హీరోయిన్స్ ఉన్నారు. స్టార్ హీరోయిన్స్ అవుదామని వచ్చి తప్పుడు వ్యక్తులతో రిలేషన్ పెట్టుకొని జీవితాలు నాశనం చేసుకున్న తారలలో మోనికా బేడీ ఒకరు. ఆమె ఏకంగా అండర్ వరల్డ్ డాన్ తో సంబంధాలు పెట్టుకొని జైలుకి వెళ్ళింది. ఈ జెనరేషన్ లో అలాంటి పరిస్థితి జాక్వలైన్ ఫెర్నాండెజ్ కి వచ్చిందని చెప్పాలి.

ఆమె సుఖేష్ చంద్రశేఖర్ అనే వ్యక్తితో కొంత కాలం రిలేషన్ లో ఉంది. అయితే సుఖేష్ మనీ లాండరింగ్ కేసులో అడ్డంగా దొరికేసాడు. దీంతో అతనితో సత్సంబంధాలు కలిగి ఉండటంతో సుఖేష్ నుంచి ఖరీదైన బహుమతులని జాక్వలైన్ బహుమతులుగా పొందిందని ఆరోపణలని ఎదుర్కొంటుంది.

అలాగే సుఖేష్ తో మనీ లాండరింగ్ వ్యవహారాలలో కూడా జాక్వలైన్ కి భాగం ఉండే అవకాశం ఉందనే ఆరోపణల నేపధ్యంలో అరెస్ట్ కూడా అయ్యింది. అయితే తరువాత మధ్యంతర బెయిల్ పై ఆమె విడుదల అయ్యింది.

కాని రెగ్యులర్ గా విచారణకి హాజరవుతుంది. ఇదిలా ఉంటే తాజాగా ఆ కోర్టుకి ఇచ్చిన వాంగ్మూలంలో భావోద్వేగానికి గురైనట్లు సమాచారం. సుఖేష్ తో రిలేషన్ కారణంగా తన జీవితం పూర్తిగా నాశనం అయ్యిందని ఆమె వాపోయినట్లు తెలుస్తుంది. అతను పెద్ద మోసగాడు. నేను అతని తప్పులని తెలుసుకోలేకపోయాను. నా జీవితం సర్వనాశనం కావడానికి అతడే కారణం.

నన్ను తప్పుడు మార్గంలో నడిపించాడు. నా భావోద్వేగాలతో ఆడుకొని నన్ను నయవంచనకి గురి చేశాడు. ప్రస్తుతం తాను ఎదుర్కొంటున్న ఈ కేసులో తనపై తప్పుడు ఆరోపణలు చేసారని జాక్వలైన్ కోర్టుకి తెలియజేసింది. అయితే పూర్తి ఆధారాలు ఉండటంతో సీబీఐ మాత్రం ఆమెని నిందితురాలిగా తమ అఫిడివెట్ లో చేర్చారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News