ఇప్పటికే ఒక దివంగత ముఖ్యమంత్రి కుమారుడితో ఢీ అంటే ఢీ కొట్టిన జగపతి బాబు.. తాజాగా మరో మాజీ ముఖ్యమంత్రి కుమారుడితో ఢీ అనేందుకు రెఢీ అవుతున్నారు. ఇదంతా రియల్ లైఫ్ లో కాదు.. రీల్ లైఫ్ లో సుమా. హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకతతో ఉండే జగపతి బాబు.. మారిన కాలానికి తగ్గట్లు.. మీద పడిన వయసును గుర్తించి.. అందుకు తగ్గట్లుగా తన పాత్రల స్వరూపాన్ని మార్చుకొన్న వైనం తెలిసిందే.
ఓ వైపు విలన్ గా వెండితెర మీద చెలరేగిపోతూనే.. మరోవైపు సాఫ్ట్ తండ్రి పాత్రలతో ప్రేక్షకుల్ని మెప్పిస్తున్నారు. టాలీవుడ్ లో మాదిరే తాజాగా శాండిల్ వుడ్ లోనూ తన సత్తా చాటాలని భావిస్తున్నారు. ఇందుకు తగ్గట్లే ఆయనకు అవకాశాలు వస్తున్నయి. లేటెస్ట్ గా ఆయన కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు నిఖిల్ గౌడ్ హీరోగా ఒక సినిమా చేస్తున్నారు.
ఈ సినిమాలో జగపతిబాబు విలన్ గా చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఈ చిత్రంలోని కీలకమైన రోల్ ని జగపతినే చేయాలని పట్టుబట్టటం.. తన పాత్రకున్న ప్రాధాన్యతతో ఆయన ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. తాజాగా ఆ చిత్రానికి సంబంధించిన నిమిషం నిడివి ఉన్న టీజర్ ఒకటి బయటకు వచ్చింది. సినిమా రిచ్ గా ఉండటంతో పాటు.. యాక్షన్ సన్నివేశాలు భారీగా ఉండటం.. కొడుకు సినిమాను మాజీ ముఖ్యమంత్రి దగ్గరుండి పర్యవేక్షిస్తున్న వైనం ఈ టీజర్ ను చూస్తే ఇట్టే అర్థమవుతోంది. ఏమైనా ఇద్దరు మాజీ ముఖ్యమంత్రుల కొడుకులతో ఢీ అంటే అన్నట్లుగా తలబడటం నాటి హీరో జగపతికి మాత్రమే అవకాశం దక్కిందని చెప్పొచ్చు.
Full View