కమ్మ లెగసీ అంటే ఏముంటుంది? -జగపతి

Update: 2015-06-25 17:30 GMT
హానెస్ట్‌గా మాట్లాడేస్తాడు. బ్రెయిన్‌లో ఉన్నది చెప్పేస్తాడు. దేవుడు ఉన్నాడని చెప్పడు, లేడని చెప్పడు. కాని తనకు తెలియదంటాడు. దేవుడు అనేవాడు కూడా అడిగితేనే అన్నీ ఇస్తే, ఇక అతనికీ మనుషులకు తేడా ఏముంది అంటూ లాజికల్‌గా ప్రశ్నిస్తాడు. సింపుల్‌గా అతనే జగపతి బాబు. ఈ మధ్యనే ఈయన తన కూతురికి ఓ అమెరికన్‌ యువకుడితో పెళ్లి జరిపించారు. ఈ సందర్భంగా చోటు చేసుకున్న కొన్ని పరిణామాలపై జగపతి ప్రపంచానికి తెలియని సంగతులు కొని చెబుతుంటే.. మైండ్‌ బ్లోయింగ్‌ అంతే.

''వీరమాచనేని ఫ్యామిలీ అంటే కమ్మ క్యాస్ట్‌లో ఓ పెద్ద ఫ్యామిలి.. మనం ఆ తెల్లోడిని అల్లుడుగా చేసుకోవడం ఏంటి? అంటూ చాలామంది నాకు సలహాలిచ్చారు. అసలు ఈ కమ్మ కులం అనే లెగసీలో ఏముంటుందో? దాన్ని మనం కనిపెట్టలేదు. మా అమ్మాయికి ఆ అబ్బాయి నచ్చాడు, మేం పెళ్లి చేస్తున్నాం.. దానికి ఈ కులం కార్డు రంగు వేయడం ఏంటో మరి'' అంటూ ఆయన తన మనోగతాన్ని చెప్పారు. ''మనం చనిపోయాక ఏదో లెగసీ అంటున్నారు. కొడుకులు లేరని చెబుతున్నారు. ఈ వీరమాచనేని వంశం నాతోనే లాస్ట్‌ అంటున్నారు. అవ్వనివ్వండి. నష్టం ఏముంది. నేను చనిపోయాక ఇక్కడ ఏం జరుగుతుందో నేను చూడను, నాకు తెలిసే ఛాన్సే లేదు. అలాంటప్పుడు లెగసీ ఏంటి.. ట్రాష్‌!!!'' అని చెప్పేశాడట.

అంతేకాదట.. కొందరు కమ్మ కులపు పెద్దలు తన అల్లుడిని ఓ డ్రగ్స్‌ కేస్‌లో ఇరికించేసి, శాశ్వతంగా అమెరికా జైళ్ళలో బంధించేద్దాం అనే ప్లాన్స్‌తో కూడా వచ్చారట. అబ్బే అలా చేయకండ్రా నాయనా అప్పుడు అతన్ని విడిపించడానికి నా జీవితం అంతా సరిపోద్ది అని చెప్పుకొచ్చాడట. ''కమ్మ అంటారు.. కాపు అంటారు.. ఏముందండీ ఈ కులాల్లో.. వేస్ట్‌ ఆఫ్‌ టైమ్‌'' అని ముగించాడు.

Tags:    

Similar News