ఆనందయ్యకు జగపతిబాబు మద్దతు

Update: 2021-05-25 15:56 GMT
ఏపీలోని నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో వెలుగుచూసిన ఆనందయ్య ఆయుర్వేద మందుకు మద్దతు పెరుగుతోంది. ఈ మందుతో కరోనా తగ్గిపోతుండడంతో 'ఆనందయ్య' ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రాముఖ్యత సంతరించుకున్నారు. ఆనందయ్య ఆయుర్వేద మందు ద్వారా ఇప్పటికే చాలా మంది కోలుకున్నారు.

ఆనందయ్య ఇస్తున్న ఆయుర్వేద మందును గుర్తించాలని ఇప్పుడు మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం, కేంద్ర ఆయూష్ శాఖ దీనిపై పరిశోధనలు జరుపుతోంది.కాగా ఆనందయ్య మందుకు తాజాగా టాలీవుడ్ నటుడు జగపతిబాబు మద్దతు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు.

'ఆనందయ్యను చూస్తుంటే తల్లి ప్రకృతి మనల్ని రక్షించడానికి ఆయన రూపంలో వచ్చిందనిపిస్తోంది. ఆనందయ్య గారి వైద్యానికి అధికారిక అనుమతి రావాలని ప్రార్థిస్తున్నాను. అదే ఈ ప్రపంచాన్ని కాపాడాలి. ఆ రకంగా దేవుడు ఆయన్ని ఆశీర్వదించాలి అని ట్వీట్ లో జగపతి బాబు పేర్కొన్నారు.
Tags:    

Similar News