మూడున్నరేళ్లుగా యావత్ దేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూసిన ట్రిపుల్ ఆర్ మొత్తానికి మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తొలిసారి కలిసి నటించిన ఈ చిత్రం దేశ వ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తూ వరుస రికార్డుల్ని తిరగరాస్తోంది. రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ మూవీ ఇప్పటికే దేశ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించిన కొన్ని క్రేజీ చిత్రాల రికార్డుల్ని తిరిగరాసి వాటిని వెనక్కి నెట్టింది.
బాహుబలి, పీకె వంటి చిత్రాల రికార్డుల్ని అధిగమించడమే కాకుండా తాజాగా 1000 కోట్ల క్లబ్ లో 'ట్రిపుల్ ఆర్' చేరిందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. దీంతో ఈ మూవీ సాధిస్తున్న రికార్డులపై దేశ వ్యాప్తంగా ట్రేడ్ వర్గాలతో పాటు, ప్రేక్షకుల్లోనూ ఆసక్తికర చర్చ మొదలైంది. రానున్న రోజుల్లో ఈ మూవీ మరిన్ని రికార్డుల్ని తిరగరాయడం కాయమని, ఓవర్సీస్ లోనూ ఈ మూవీ సరికొత్త చరిత్రకు నాంది పలుకుతోందని వార్తలు వినిపిస్తున్నాయి. రామ్ చరణ్, ఎన్టీఆర్ ల నటన, వారి పాత్రలని జక్కన్న తీర్చి దిద్దిన తీరు సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టేలా చేయడం విశేషంగా చెప్పుకుంటున్నారు.
ఇదిలా వుంటే ఈ మూవీ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూసిన ప్రేక్షకులు ఇప్పడు జక్కన్న నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి ఆలోచించడం మొదలు పెట్టారు. రాజమౌళి 'ట్రిపుల్ ఆర్' తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు తో ఓ భారీ యాక్షన్ అడ్వెంచర్ మూవీని తెరపైకి తీసుకురానున్న విషయం తెలిసిందే. 'ట్రిపుల్ ఆర్' రిలీజ్ కావడంతో ఈ చిత్రంపై చర్చ జరుగుతోంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ మాస్ హీరోలు. మహేష్ బాబు క్లాస్ గా కనిపించే మాస్ హీరో. మరి ఈ హీరోని జక్కన్న ఎలా చూపించబోతున్నారన్నది ఇప్పడు ఆసక్తికరంగా మారింది.
'ట్రిపుల్ ఆర్' కరోనా సెకండ్ వేవ్, ఒమిక్రాన్ ల కారణంగా రిలీజ్ ఆలస్యమవుతూ వచ్చింది. ఈ సమయంలో మహేష్ ప్రాజెక్ట్ కు సంబంధించిన స్టోరీ కి సమయం చిక్కడంతో దర్శకుడు రాజమౌళి, స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ కథా చర్చలు చేశారట. ఇటీవల ఓ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేష్ చిత్రానికి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాల్ని రాజమౌళి వెల్లడించారు. ఒమిక్రాన్ , కరోనా కారణంగా సినిమా రిలీజ్ కు టైమ్ వుండటంతో రెండున్నర నెలల పాటు మహేష్ సినిమాకు సంబంధించిన స్టోరీ ఎలా వుండాలి?.. ఏ జోనర్ లో వుండాలని చర్చించుకున్నారట.
ఇందులో లార్జర్ దెన్ లైఫ్ స్టోరీస్ రెండింటిని సెలెక్ట్ చేశారట. అందులో ఒక స్క్రీప్ట్ ని మహేష్ కోసం ఫైనల్ చేయబోతున్నామని రాజమౌళి రీసెంట్ గా వెల్లడించడంతో ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. ఈ మూవీ మహేష్ ఫ్యాన్స్ కి ఓ ట్రీట్ లా వుంటుందని, ఇదొక యాక్షన్ అడ్వెంచరస్ మూవీ అని రాజమౌళి చెప్పడం విశేషం.
అంతే కాకుండా ఈ సినిమా ఓ ఎపిక్ గా నిలిచిపోతుందని అభిమానులకు మాటిస్తున్నానని అన్నారట. భారీ బడ్జెట్ తో హాలీవుడ్ చిత్రాలకు థీటుగా తెరపైకి రానున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది చివర్లో సెట్స్ పైకి తీసుకెళ్లే అవకాశం వుందని తెలుస్తోంది. ఈ భారీ చిత్నాన్ని దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కె.ఎల్. నారాయణ నిర్మించబోతున్నారు.