రాజమౌళి సినిమా చేస్తున్నాడు అంటే ఆయన ఒక్కడే కాకుండా ఆయన ఫ్యామిలీ మెంబర్స్ పలువురు కూడా ఆ సినిమా ప్రొడక్షన్ పైప్ లైన్ లో వర్క్ చేస్తూ ఉంటారు. స్టోరీ మొదలుకుని ప్రమోషన్స్ వరకు కూడా ఆయన కుటుంబ సభ్యులు ఆయనకు మద్దతుగా నిలుస్తూ ఉంటారు. రాజమౌళి ప్రతి సినిమాకు కూడా ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథను అందిస్తారు. ఆయన అందించే కథలనే రాజమౌళి సినిమాలుగా తీస్తూ భారీ విజయాలను దక్కించుకుంటున్నాడు.
తండ్రి విజయేంద్ర ప్రసాద్ అందించిన కథను అన్న కాంచి తో కలిసి స్క్రిప్ట్ గా మల్చుతాడు. కథకు తగ్గ కాస్ట్యూమ్స్ ను జక్కన్న భార్య రమా అందిస్తారు. షూటింగ్ సమయంలో ప్రొడక్షన్ ప్రొడ్యూసర్ గా వదిన శ్రీవల్లి వ్యవహరిస్తారు. ఇక సంగీతం ను తన అన్న కీరవాణి ఇస్తాడు. షూటింగ్ సమయంలో సెట్ ప్రాపర్టీస్ మొదలుకుని ప్రతి ఒక్క విషయంలో కూడా కొడుకు కార్తికేయ సహాయ సహకారం ఉంటుంది. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గానే కాకుండా చాలా బాధ్యతగా అతడు రాజమౌళి పనుల్లో భాగస్వామ్యం తీసుకుంటాడు. సినిమా విడుదల సమయంలో ప్రమోషన్ విషయంలో కూడా కార్తికేయ కీలకంగా వ్యవహరిస్తాడు. ఇక ఆర్ ఆర్ ఆర్ సినిమా గ్రాఫిక్స్ వర్క్ ను వదిన శ్రీవల్లి కూడా పర్యవేక్షించారట. ఇలా సినిమా మొదటి పెట్టక ముందు నుండి విడుదల అయ్యే వరకు తన కుటుంబ సభ్యుల సహకారంతోనే రాజమౌళి ముందుకు వెళ్తాడు.
ఇన్నాళ్లు ఈ విషయాలను ఆయన బయటకు చెప్పేవారు కాదు. వారు నా వాళ్లు.. వాళ్ల గురించి నేను ఎంత చెప్పినా తక్కువే అనేవాడు. అప్పుడప్పుడు కార్తికేయ గురించి చెప్పినా కూడా ఇతర కుటుంబ సభ్యుల సహకారం గురించి ఎక్కువగా చెప్పేవాడు కాదు. కాని ఆర్ ఆర్ ఆర్ సినిమా ముంబయి ఈవెంట్ లో రాజమౌళి సుదీర్ఘం గా మాట్లాడాడు. ఆ సమయంలో హిందీ ప్రేక్షకులకు తన ఫ్యామిలీ మొత్తంను పరిచయం చేస్తూ వారి గురించి గొప్పగా మాట్లాడుతూ సినిమాకు వారి సహకారం ఏ పాటిది అనే విషయాన్ని వివరించాడు. సినిమా విడుదల అయ్యే వరకు కుటుంబ సభ్యుల సహకారం ఉంటుందని రాజమౌళి చెప్పుకొచ్చాడు. మొదటి సారి అది కూడా హిందీలో రాజమౌళి తన కుటుంబం గురించి మాట్లాడటం.. ప్రతి ఒక్కరి పేరును ప్రస్తావిస్తూ గొప్పగా మాట్లాడటం వైరల్ అవుతోంది. యూట్యూబ్ లో ప్రస్తుతం ఈ వీడియోను తెలుగు జనాలు కూడా తెగ చూసేస్తున్నారు.
రాజమౌళి మాట్లాడుతూ.. స్క్రిప్ట్ వర్క్ సమయంలో కాంచి అన్నయ్య చాలా సపోర్ట్ గా నిలుస్తాడు. ఆయన్ను మేము స్క్రిప్ట్ డాక్టర్ అని పిలుస్తూ ఉంటాం. షూటింగ్ ప్రారంభం అయిన తర్వాత ఎక్కడ ఏ చిన్న తప్పు జరిగినా కూడా ఆయన గుర్తించి చెప్తారు. అందుకే వాచ్ డాగ్ అని కూడా అంటూ ఉంటాం. షూటింగ్ సమయంలో ఆయన ఇచ్చే ఇన్ పుట్స్ నాకు ప్రతి సినిమాకు చాలా ఉపయోగపడుతాయి. అందుకే ఆయన తప్పకుండా నా సినిమాలన్నింటికి ఉంటాడు.
ఇక పెద్దన్న కీరవాణి కేవలం సంగీతం మాత్రమే ఇవ్వకుండా మేకింగ్ విషయాల్లో కూడా ఎన్నో విషయాలను నాకు సలహాలు సూచనలు ఇస్తూ ఉంటారు. షూటింగ్ సమయంలో మరియు షూటింగ్ పూర్తి అయిన తర్వాత కూడా ఆయన సలహాలు ఉపయోగించుకుని ముందుకు వెళ్తాను. ఆర్ ఆర్ ఆర్ చూసి బాహుబలి కంటే బాగుందని మొదటి ప్రశంస దక్కింది ఆయన నుండే. మంచి జడ్జ్‌మెంట్ ఉన్న వ్యక్తి అంటూ కీరవాణి పై జక్కన్న ప్రశంసలు కురిపించాడు.
ఇక ఆయన భార్య అయిన శ్రీవల్లిని గురించి కూడా రాజమౌళి గొప్పగా మాట్లాడాడు. ఆమె బాహుబలి సినిమాకు షూటింగ్ జరిగినంత కాలం లైన్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. ఆ అనుభవంతో ఆర్ ఆర్ ఆర్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ లైన్ ప్రొడ్యూసర్ గా కూడా ఆమెకే బాధ్యతలు అప్పగించాము. ఆమె మరోసారి తనకు అప్పగించిన బాధ్యతను సమర్ధవంతంగా నెరవేర్చారు.
ఇక మా అబ్బాయి కార్తికేయ సినిమాకు సంబంధించిన అన్ని వ్యవహారాలు చూసుకుంటూ లైన్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తాడు. నేనే ఎక్కువ కష్టపడుతాను అంటే నాకంటే ఎక్కువ కష్టపడే వ్యక్తి కార్తికేయ. ఏదైనా అనుకుంటే అది పూర్తి అయ్యే వరకు కూడా వదిలి పెట్టకుండా పట్టుదలతో ప్రయత్నించి సాధిస్తాడు. సినిమా కోసం ఎంతో కష్టపడ్డాడు అంటూ చెప్పుకొచ్చాడు. ఇంకా తన కుటుంబం నుండి ఈ సినిమాకు వర్క్ చేసిన ప్రతి ఒక్కరి గురించి కూడా జక్కన్న గొప్పగా చెప్పుకొచ్చాడు. రాజమౌళి తదుపరి సినిమా కు ఆయన కూతురు కూడా వర్క్ చేస్తారేమో చూడాలి.