అందుకే లేవమన్నాడట ఈ కొత్త ఎన్టీఆర్

Update: 2018-03-29 17:46 GMT
నందమూరి బాలకృష్ణ మాట్లాడితే ఉంటుందో అందరికి తెలిసిందే. ఒక్కోసారి గాంబిర్యం ఉట్టిపడేలా పౌరుషం కనిపిస్తుంది. మరోసారి మర్యాద పూర్వకంగా సున్నితంగా మాట్లాడే తీరు అందరిని ఆకట్టుకుంటుంది. ఆయన అభిమానులకు బాలయ్య లో నచ్చే గుణం అదే. అలాగే ఏది ఉన్న కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడేస్తుంటారు. ఒక్కసారి తొందరపడినా కూడా ఆయన మాటల్లో సమాధానం కనిపిస్తోంది.

అయితే ఈ రోజు ఎన్టీఆర్ బయోపిక్ లాంచ్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు - కే.రాఘవేంద్రరావు వంటి ప్రముఖుల ఆధ్వర్యంలో సినిమా అధికారిక ప్రారంభోత్సవం జరిగింది. అయితే వేడుకకి సీనియర్ నటి జమున గారు కూడా ముఖ్య అతిధిగా వచ్చారు. రామారావు గారితో ఎన్నో సినిమాలు చేసిన ఆమె బాలకృష్ణ గారి సినిమాల్లో కూడా కొన్ని పాత్రలు చేశారు. అయితే బాలయ్య స్టేజ్ పైకి వస్తుండగా ఆమె లేచి నిలబడటానికి ప్రయత్నించారు. సాధారణంగా ఎవరైనా సరే పెద్దవారు అలా కూర్చున్న చోటు నుంచి నిలబడటానికి ప్రయత్నిస్తే పరవాలేదు కూర్చొండని అంటారు. కానీ బాలయ్య మాత్రం  లేవండి అని అనేశారు. బాలయ్య అలా ఎందుకు అన్నాడు అని సమీపంలో ఉన్న వారు కొంత మంది ఆశ్చర్యపోయారు. కానీ అలా అనడానికి ఒక కారణం ఉందని వెండితెరపై కొత్తగా ఎన్టీఆర్ అవతారం ఎత్తున్న ఈ నటుడు తన ప్రసంగంలో వివరించారు.

బాలయ్య మాట్లాడుతూ.. జమున గారు నాన్న గారితో ఎన్నో సినిమాలు చేశారు. మొదటి సారి నేను అక్బర్ సలీమ్ అనార్కళి సినిమాలో జమున గారితో నటించాను. నాకు తల్లి పాత్రలో కనిపించారు. ఆమె నటన గురించి ఆమె సినిమాలే చెబుతాయి. ఎన్నో అద్భుతమైన పాత్రలు చేశారు. అయితే ఇందాక ఆమె నేను రాగానే లేవడానికి చూశారు. నేను లేవండమ్మ అన్నాను. ఎందుకంటే మర్యాద గురించి అలా అనలేదు. ఆమె ఎనర్జీని చూస్తే ఒక ఇన్స్పిరేషన్. ఎంతో ప్రేరణ కలుగుతుంది. అందుకే అలా చెప్పాను అని బాలయ్య చెప్పారు.


Tags:    

Similar News