అవ్వడానికి సెన్సారింగ్ కార్యక్రమం ఆల్రెడీ పూర్తయిపోయినా కూడా.. అసలు ఇప్పటివరకు ఇంకా 'జనతా గ్యారేజ్' ప్రింటులు డిస్పాచ్ అవ్వకపోవడం కాస్త ఆశ్చర్యానికి గురవ్వాల్సిన విషయమే. అయితే ఈ సినిమా బాక్సులు ఇంకా ఎందుకు ఎక్సపోర్టు కాలేదంటే.. సెన్సార్ అయిపోయిన కాపీకి ఇంకా రంగులు అద్దుతున్నారట. అదేనండీ.. డిజిటల్ ఇంటర్మీడియట్ పనుల్లో ఉన్నారట.
ఇప్పుడు సినిమాలన్నీ డిజిటల్ ఫార్మాట్ లోనే తీస్తున్నారు కాబట్టి.. ఖచ్చితంగా పోస్టు ప్రొడక్షన్లో కలర్ గ్రేడింగ్ చేయాల్సి వస్తోంది. అయితే ఈ ప్రాసెస్ కు ఎంత టైమ్ ఇస్తే అంత అద్భుతంగా రంగులను తీర్చిదిద్దొచ్చు. సినిమాటోగ్రాఫర్ తిరు ఇప్పుడు దగ్గరుండి మరీ ఈ గ్రేడింగ్ చేయిస్తున్నాడు. ఈరోజు (సోమవారం) మధ్యాహ్నంతో ఈ కలరింగ్ ఘట్టానికి కూడా కొబ్బరికాయ కొట్టేశారు. ఇప్పుడు సినిమాను డిజిటల్ రిలే ఫార్మట్ లోకి కన్వర్టు చేసి ఇక హార్డు డిస్కులు రాసుకోవడమే. మిడ్ నైట్ వరకు ఆ పని కూడా పూర్తయిపోతుందట. అప్పుడు సినిమా బాక్సులను అన్ని లొకేషన్లకూ పంపేస్తారు.
కొరటాల శివ డైరక్షన్లో రూపొందిన జనతా గ్యారేజ్ సినిమాలో ఎన్టీఆర్ - సమంత - నిత్యా మీనన్ - మోహన్ లాల్ ఇంపార్టెంట్ పాత్రలను పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం మాంచి హిట్టయ్యింది.