కొన్ని రోజులుగా ప్రచారంలో ఉన్నదే నిజమైంది. ‘జనతా గ్యారేజ్’ రిలీజ్ డేట్ మారింది కాకపోతే సినిమా వాయిదా పడిందేమో అని కంగారు పడాల్సిన పని లేదు. ముందుగా అనుకున్నట్లు సెప్టెంబరు 2న కాకుండా ఒక రోజు ముందే ఒకటో తారీఖున సినిమాను రిలీజ్ చేయాలని నిర్ణయించారు. నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నుంచే ఈ మేరకు సమాచారం వచ్చింది.
సెప్టెంబరు 2న భారత్ బంద్ ఉంటుందో లేదో అన్న సందిగ్ధత కొనసాగుతున్నప్పటికీ.. ఒక రోజు ముందు రావడం వల్ల అడ్వాంటేజే తప్ప పోయేదేం లేదన్న ఉద్దేశంతో గురువారమే సినిమాను రిలీజ్ చేయాలని ఫిక్సయ్యారు. 1వ తేదీన మొదలుపెడితే.. 5వ తేదీ (సోమవారం) వినాయక చవితి వరకు ఐదు రోజుల లాంగ్ వీకెండ్ ‘జనతా గ్యారేజ్’కు కలిసొచ్చే విషయమే. సినిమా అంచనాలకు తగ్గట్లుగా ఉంటే వీకెండ్ కలెక్షన్ల రికార్డులు బద్దలవడం ఖాయమే.
‘జనతా గ్యారేజ్’ షూటింగ్ ఈ రోజే పూర్తయి.. గుమ్మడికాయ కొట్టేశారు. ఈ నెల 27కల్లా ఫస్ట్ కాపీ రెడీ అయిపోతుంది. వెంటనే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసి 1న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కొరటాల శివ-ఎన్టీఆర్-మైత్రీ మూవీమేకర్స్ క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి.