యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ మూవీ ఏ రేంజ్ సక్సెస్ సాధించిందో.. ఇందులో ప్రతీ పాట కూడా అదే రేంజ్ లో విజయం సాధించాయి. అసలు ఈ మూవీ సక్సెస్ లో పాటలకు కూడా ప్రధాన పాత్ర ఉందనే చెప్పుకోవాలి. ముఖ్యంగా 'రాక్ అండ్ రోల్ అంది సెలవు రోజు' అంటూ సాగే పాట.. ఈ కాలంలో వస్తున్న పాటలు భిన్నంగా సాగుతుంది.
రాక్ అండ్ రోల్ పాటకు సంబంధించిన మేకింగ్ వీడియోను జనతా గ్యారేజ్ యూనిట్ రిలీజ్ చేసింది. పాట రాయడం దగ్గర నుంచి తీయడం వరకు సంగతులను ఆడియన్స్ తో పంచుకున్నారు. తెరపై చూసేందుకు సింపుల్ షాట్స్ అనిపించినా.. నేచర్ ని కేప్చర్ చేయడం కోసం యూనిట్ పడ్డ కష్టం కనిపిస్తుంది. భారీ క్రేన్ లు.. డ్రోన్ కెమేరాలతో.. ఈ పాటను పిక్చరైజ్ చేశారు. ముఖ్యంగా అలాంటి క్లైమేట్ లో విజువల్స్ పర్ఫెక్ట్ గా రావడం చాలా కష్టం అనే విషయం గుర్తుంచుకోవాలి.
ఈ పాటను కేరళ అందాల్లో షూట్ చేసిన సంగతి తెలిసిందే. తన కంఫర్ట్ జోన్ లో అంటే.. ప్రకృతి అందాల నడుమ తీయడం చాలా ఉత్సాహాన్ని ఇచ్చిందని నిత్యామీనన్ చెబితే.. ప్రతీ లైన్ పర్ఫెక్ట్ గా వచ్చేవరకు దర్శకుడు తనతో జర్నీ చేశాడని లిరిక్ రైటర్ రామజోగయ్య శాస్త్రి చెబుతున్నారు. కొరటాల శివ మైండ్ లో ఉన్న పర్ఫెక్ట్ టూర్ ని ఆన్ స్క్రీన్ పై చూపించడమే కాదు.. లిరిక్ రూపంలో కూడా వినిపించాడని అన్నారు రామజోగయ్య.
Full View