అందుకే మా ఇండస్ట్రీలోకి రావద్దని చెప్పింది: జాన్వీ కపూర్

Update: 2022-08-09 09:30 GMT
వెండితెరపై అతిలోకసుందరిగా ఎంతగానో గుర్తింపును అందుకున్న శ్రీదేవి వారసత్వం నుంచి వచ్చిన జాన్వీ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా అవకాశాలు అందుకుంటున్న విషయం తెలిసిందే. ఈ బ్యూటీ అవకాశాలు బాగానే అందుకుంటుంది కానీ బాక్సాఫీస్ వద్ద సరైన విజయాలు మాత్రం దక్కడం లేదు. మొదటి నుంచి కూడా విభిన్నమైన సినిమాలు చేయాలని నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు కూడా చేయాలని ఆలోచిస్తుంది.

అయితే ఇంతవరకు మాత్రం కమర్షియల్ గా మొదటి సక్సెస్ రాలేదు. అయినప్పటికీ కూడా బ్యాక్ గ్రౌండ్ బలంగా ఉండడంతో ఈ బ్యూటీకి మంచి అవకాశాలు వస్తున్నాయి. దానికి తోడు ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ కూడా తరచుగా తన ప్రొడక్షన్లో జాన్వ కొరకు ప్రత్యేకంగా ఒక సినిమా ఆఫర్ చేస్తూ ఉండడం విశేషం. ఇక జాన్వీ కపూర్ మాత్రం వీలైనంతవరకు తన సొంతంగానే ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలి అనుకుంటుంది.

అయితే ఇండస్ట్రీలోకి వచ్చే ముందు తన తల్లి శ్రీదేవి చెప్పిన విషయాల గురించి ఇటీవల ఇంటర్వ్యూలో జాన్వి కపూర్ తెలియజేసింది  మొదట నేను సినిమాల్లోకి వస్తానని అన్నప్పుడు మా అమ్మ అందుకు ఒప్పుకోలేదు.

ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం అంత ఈజీ కాదు అని ఎంతో కఠినంగా ఉంటుంది అని ఆ పరిస్థితులను దాటుకుని రావాలి అంటే చాలా కష్టమని కూడా శ్రీదేవి తెలిపిందట. అయినప్పటికీ కూడా తనకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం పెరిగిపోయింది అని అందుకే పట్టుకోకుండా చెప్పడంతో మా అమ్మ సపోర్ట్ చేసినట్లుగా జాన్వీ కపూర్ తెలియజేసింది.

మొదట జాన్వీ దడక్ సినిమాతో ఎంట్రీ ఇవ్వడానికి కూడా ముఖ్య కారణం శ్రీదేవి. ఆమెను గ్రాండ్ గా బాలీవుడ్లోకి తీసుకురావాలి అని శ్రీదేవి ప్రయత్నాలు చేసింది  కానీ మొదటి సినిమా విడుదల కాకముందే ఆమె మరణించిన విషయం తెలిసిందే.

ఇక ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు కూడా తెరపైకి వస్తూ ఉండడంతో జాన్వీ అటువైపు కూడా అడుగులు వేసే ప్రయత్నం చేస్తుంది. ఇక త్వరలోనే విజయ్ దేవరకొండ తో ఆమె ఒక సినిమా చేసే అవకాశం ఉన్నట్లు టాక్ అయితే వినిపిస్తోంది.
Tags:    

Similar News