సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన సెలబ్రిటీలకు ఎప్పుడు విమర్శలు ఎదురవుతూనే ఉంటాయి. బ్యాక్ గ్రౌండ్ ఉన్న వాళ్ళకి సులభంగా అవకాశాలు వస్తాయని, అంతే సులభంగా ఫేమ్ దక్కుతుందని నెటిజన్లు ఎప్పటికప్పుడు సూటి పోటి మాటలతో గుచ్చుతూనే ఉంటారు. ఈ విమర్శలపై జాన్వీ కపూర్ స్పందిస్తూ తన మనసులో ఉన్న ఆవేదనను బయట పెట్టింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు చేస్తున్న జాన్వీ కపూర్ త్వరలోనే 'మిలీ' అనే మూవీతో నార్త్ ప్రేక్షకులను పలకరించబోతోంది. అనుకోకుండా మైనస్ 18 డిగ్రీల గడ్డకట్టుకుపోయే చలిలో ఇరుక్కుపోయిన మిలీ అనే యువతి ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంది..? ఆ ప్రమాదం నుంచి ఎలా తన ప్రాణాలను కాపాడుకుంది..? అన్నదే ఈ సినిమా ప్రధాన కథ.
మలయాళ సినిమా 'హెలెన్' కు ఇది రీమేక్. మత్తుకుట్టి జేవియర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్ 4న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా జాన్వీ కపూర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె వృత్తిపరమైన విషయాలే కాకుండా వ్యక్తిగత విషయాలను సైతం షేర్ చేసుకుంది.
'మిలీ' సినిమా కోసం దర్శకుడి సూచన మేరకు ఏడు కేజీల బరువు పెరిగానని.. ఇప్పుడు తగ్గడం పెద్ద ప్రాసెస్ అని చెప్పుకొచ్చింది. అలాగే చలిలో షూటింగ్ చేయడానికి ఎంతో కష్టపడ్డామని.. ఎలుకలు వచ్చి తన కాలు కొరుకుతున్న తెలియనంత చలిలో షూటింగ్ చేశామని జాన్వీ తెలిపింది. ఇక ఈ క్రమంలోనే నెటిజన్ల నుంచి ఎదురయ్యే విమర్శల గురించి ఆమె స్పందించింది.
జాన్వీ మాట్లాడుతూ.. 'బోనీ కపూర్-శ్రీదేవి కూతురు కాబట్టి జీవితంలో అన్నీ సులభంగా దొరుకుతాయని, అవకాశాలు ఈజీగా వస్తాయనే మాటలు ఎప్పుడూ నన్ను బాధిస్తూనే ఉంటాయి. కానీ.. కళ కోసం, సినిమా కోసం ప్రాణం పెట్టి నిజాయితీగా పని చేయడం నా రక్తంలోనే ఉంది. సినీ నేపథ్యం రెండు మూడు అవకాశాల వరకే పని చేస్తుంది.
ఆ తర్వాత స్వయం ప్రతిభతో రాణించాల్సిందే. విమర్శకులకు సమాధానం చెప్పాలనే కసితో కష్టపడి పని చేస్తుంటా. నన్ను నేను నిరూపించుకోవడానికి ప్రతి రోజూ ఓ యుద్ధమే చేస్తున్నా' అంటూ జాన్వీ కపూర్ చెప్పుకొచ్చింది. దీంతో ఈమె కామెంట్స్ కాస్త నెట్టింట వైరల్‌గా మారాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.