జాన్వీ కపూర్ - ఖుషీ కపూర్ ఇటీవల తమ స్నేహితుడు ఓర్హాన్ అవత్రమణితో కలిసి దుబాయ్ కి విహారయాత్రకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ ముగ్గురూ నగరంలో చలికాలాన్ని తమకు నచ్చినట్టుగా ఆస్వాధించడం బయటపడింది. ప్రస్తుతం ఎడారిలో సఫారీకి వెళ్లడమేగాక లైవ్ గా ఫోటోషూట్లతో ఫుల్ చిలౌట్ గా సమయాన్ని గడుపుతున్నారు. బుధవారం జాన్వీ తన దుబాయ్ ట్రావెల్ డైరీల నుండి ఫోటోషూట్ డంప్ ను షేర్ చేసింది.
దుబాయ్ ఎడారిలో విలన్ గా మారిపోయిన జాన్వీ అలా హెడ్ స్కార్ప్ ని ధరించి హల్ చల్ చేసింది. తనతో పాటే సోదరి ఖుషీ కపూర్ ఏమాత్రం ఏ విషయంలోనూ అస్సలు తగ్గడం లేదు. జాన్వీ- ఖుషీ -ఓర్హాన్ ఇంతకుముందు కలిసి పోజులిచ్చారు. తాజాగా జాన్వీ షేర్ చేసిన ఫోటోలలో మెరూన్ కలర్ డిజైనర్ టాప్ - నీలిరంగు డెనిమ్ షార్ట్ లో ఎడారిలో పోజులిస్తూ కనిపించింది. అలాగే జాన్వీ నలుపు - తెలుపు రంగుల తలపాగాతో ఎడారిలో ఒక రేంజులో చెలరేగడం కనిపిస్తోంది.
ఈ విహారయాత్రలో జాన్వీతో పాటు ఖుషీ అంతే అల్లరిగా కనిపిస్తోంది. మెరూన్ టాప్ - హెడ్ గేర్ లో జాన్వీతో కలిసి ఖుషీ అంతే రెబల్ గా కనిపించింది. ఆ లుక్ కి ఒక జత బ్లాక్ షార్ట్ తో జత చేసి మైండ్ బ్లాక్ చేసింది. జాన్వీ - ఖుషీ సిస్టర్స్ తమ ఎడారి జీప్ పై పోజులిచ్చి సహచరులకు ప్రధాన ప్రయాణ లక్ష్యాలను నిర్దేశించిన ఫోటోలు వైరల్ గా మారారు. డెస్సర్ట్ ఇన్ ది డిజర్ట్ అని జాన్వీ కపూర్ తన క్యాప్షన్‌లో రాశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు అంతర్జాలంలో వైరల్ గా మారాయి. దుబాయ్ ఎడారిలో తాలిబన్లలా చెలరేగిన సిస్టర్స్ అంటూ యూత్ కామెంట్లు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
సిస్టర్స్ హంగామా ఆ రేంజులో
అక్కా చెల్లెళ్లు జాన్వీకపూర్ - ఖుషీ కపూర్ ఇటీవల హెడ్ లైన్స్ లోకి వచ్చారు. ఖుషీ కపూర్ ఇటీవల 21వ పుట్టినరోజును జరుపుకోగా ఈ పార్టీలో జాన్వీ స్పెషల్ బార్బీ బేబీగా మెరిసిపోయింది. ఈ వేడుకల్లో సిస్టర్స్ ఇద్దరూ షో స్టాపర్స్ గా నిలిచారు. జాన్వీ కపూర్ సోదరి లడ్డూ బేబీ అకా ఖుషీ కపూర్ బర్త్ డే పార్టీని చిలౌట్ గా చేసుకున్నారు. ఖుషీ కంటే జాన్వీ మూడేళ్లు పెద్దది. ఈ వేడుక నుంచి జాన్వీ- ఖుషి వారి స్నేహితుల ఫోటోలు అంతర్జాలంలో వైరల్ అయ్యాయి.
బోనీ కపూర్-దివంగత శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషీ కపూర్ కూడా జాన్వీ లా నటి కావాలని కోరుకుంటోంది. ప్రస్తుతం ఆమె న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో చదువుతోంది. జాన్వీ ధడక్ చిత్రంతో ఇషాన్ ఖట్టర్ సరసన సినీరంగ ప్రవేశం చేసిన సంగతి తెలిసిందే. తదుపరి దోస్తానా 2 చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సంవత్సరం ప్రారంభంలో తన చిత్రం గుడ్ లక్ జెర్రీ షూటింగ్ ను జాన్వీ పూర్తి చేసింది. ఈ వార్తను తన అభిమానులతో పంచుకోవడానికి ఆమె ఇన్ స్టాగ్రామ్ లోకి వెళ్లింది. ఈ చిత్రానికి సిద్ధార్థ్ సేన్ గుప్తా దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే మలయాళంలో విజయవంతమైన హెలెన్ రీమేక్ ను ఆగస్టులో ప్రారంభమైంది.