శ్రీదేవి మరో కోరికను తీర్చబోతున్నాడు

Update: 2019-10-11 04:57 GMT
అతిలోక సుందరి శ్రీదేవి అకాల మరణంతో ఆమెకు తీరని కోర్కెలు చాలా ఉండి పోయాయి. కూతురును స్టార్‌ హీరోయిన్‌ గా చూడాలని శ్రీదేవి ఎక్కువగా ఆశపడేవారు. తన వారసురాలు జాన్వీ అంటూ శ్రీదేవి అనుకునేవారట. అందుకే జాన్వీని హీరోయిన్‌ గా పరిచయం చేసేందుకు చాలా కష్టపడింది. జాన్వీకి దగ్గరుండి యాక్టింగ్‌ పాఠాలు నేర్పించడంతో పాటు పలు కళల్లో ప్రావిణ్యం పొందేలా ప్రోత్సహించింది. అలాంటి జాన్వీ కపూర్‌ ఇప్పుడు హీరోయిన్‌ గా పరిచయం అయ్యి ప్రేక్షకుల మన్ననలు పొందుతుంది. ఆ విషయాన్ని శ్రీదేవి చూడలేక పోతుంది.

ఇక జాన్వీ కపూర్‌ హీరోయిన్‌ గా సొంత బ్యానర్‌ లో ఒక సినిమాను ఎప్పటికైనా నిర్మించాలని శ్రీదేవి పదే పదే అనేదంటూ బోణీ కపూర్‌ గతంలో చెప్పుకొచ్చాడు. ఆ కోరికను కూడా నెరవేర్చుకోకుండానే శ్రీదేవి మృత్యు ఒడిలోకి వెళ్లి పోయింది. శ్రీదేవి కోరిక అనుసారంగా తన సొంత బ్యానర్‌ లో జాన్వీ కపూర్‌ తో సినిమాను నిర్మించేందుకు బోణీ కపూర్‌ సిద్దం అయ్యాడు. బాంబే గర్ల్‌ అనే టైటిల్‌ తో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌ గా సంజయ్‌ త్రిపాఠి దర్శకత్వంలో బోణీ కపూర్‌ సినిమాను నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన వర్క్‌ చకచక జరుగుతోంది.

నా భార్య అడిగినట్లుగా ఈ సినిమాను నా కూతురుతో నిర్మించబోతున్నాను. ఆమె కోరిక నెరవేర్చబోతున్నందుకు సంతోషంగా ఉందన్నాడు. జాన్వీ కపూర్‌ విజయాన్ని శ్రీదేవి ఎక్కడున్నా ఆనందిస్తుందని.. మా బిడ్డను ఆశీర్వదిస్తుందని భావిస్తున్నట్లుగా బోణీ కపూర్‌ పేర్కొన్నాడు. శ్రీదేవి మరో కోరిక తమిళ స్టార్‌ హీరో అజిత్‌ తో ఒక సినిమాను నిర్మించడం. ఆ కోరికను 'నేర్కొండ పార్వయ్‌' చిత్రంతో బోణీ కపూర్‌ తీర్చాడు. ఇప్పుడు కూతురు సినిమా విషయమై శ్రీదేవి కన్న కలను నెరవేర్చబోతున్నాడు.

Tags:    

Similar News