ఆర్ ఆర్ ఆర్ పాన్ ఇండియాని షేక్ చేసి జపాన్ లో సైతం వేటని కొనసాగిస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవల జపాన్ లో రిలీజ్ అయిన సినిమాకు అక్కడి ప్రేక్షకులకు కూడా బ్రహ్మరధం పడుతున్నారు. రామ్..భీమ్ ని వెండి తెరపై చూసి జపాన్ అభిమానులు సంబరపడుతున్నారు. ఇదే వేగం ఇంకొన్నిరోజులు కొనసాగితే జపాన్ లో బాహుబలి వసూళ్లని సైతం కొల్లగొట్టేస్తుందని టాక్ వినిపిస్తుంది.
పబ్లిక్ టాక్ తో సినిమా కి లాంగ్ రన్ ఉంటుందని ట్రేడ్ వర్గాలు సైతం అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాహుబలి వసూళ్లకు ఆర్ఆర్ ఆర్ థ్రెట్ ఉందా? అన్నసందేహం మొదలైంది. తాజాగా ఆర్ ఆర్ ఆర్ సినిమా చూడటానికి చాలా మంది ప్రేక్షకులు ఏకంగా 100 కిలోమీటర్ల దూరం నుంచి ఆర్ ఆర్ ఆర్ థియేటర్లకు తరలివస్తున్నట్లు తెలిసింది.
ఈ ఒక్క సంఘటనతో 'ఆర్ ఆర్ ఆర్' ని ప్రేక్షకులు ఎంతగా ఆదరిస్తున్నారన్నది అద్దం పడుతుంది. ఈ సందర్భంగా రాజమౌళి వాళ్లందరికీ కృతజ్ఞతలు తెలియజేసారు. మొత్తానికి మూవ్ మెంట్ చూస్తుంటే? ఆర్ ఆర్ ఆర్ కూడా జపాన్ ని షేక్ చేస్తున్నట్లే కనిపిస్తుంది.
అప్పట్లో 'బాహుబలి' రిలీజ్ అయినప్పుడు ఇలాంటి సన్నివేశమే కనిపించింది. 'ఆర్ ఆర్ ఆర్' కంటే బిగ్ స్పాన్ లో బాహుబలి అక్కడ రిలీజ్ అయినా కొన్ని చోట్ల అందుబాటులో లేకపోవడంతో సమీప ప్రాంతాలకు వచ్చి చూసి వెళ్లేవారు.
మళ్లీ ఇదే సన్నివేశం ఆర్ ఆర్ ఆర్ కి కనిపిస్తుంది. మొత్తానికి మరోసారి తెలుగు సినిమా జపాన్ లో క్రేజీ మూవీగా నిలవడం విశేషం. అలాగే హీరోల్ని విదేశీ అభిమానులు వ్యక్తిగతంగానూ ఎలాంటి అభిమానం చూపిస్తారో? ప్రభాస్ ప్రూవ్ చేసాడు.
ఆయన బర్త్ డే సందర్భంగా కొంత మంది జపాన్ అభిమానులు ఉదయాన్నే హైదరాబాద్ లో డార్లింగ్ ఇంటి ముందుకెళ్లి మరీ విషెస్ తెలియజేసారు. ఈసారి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్..యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైతం అదే తరహా అభిమానాన్ని చూసే అవకాశం ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.