టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రతివారం నూతన సినిమాలు విడుదల అవుతూనే ఉన్నాయి. అలాగే వరుసగా సినిమాలు రిలీజ్ అవుతున్నా కొద్దీ మేకర్స్ లో కూడా ఉత్సాహం డబుల్ అవుతుంది. కానీ డబుల్ ఉత్సాహంతో విడుదలైన సినిమా ట్రిపుల్ కలెక్షన్స్ రాబడితే ఎలా ఉంటుంది ఊహించండి. ప్రస్తుతం అదే ఆనందంలో ఉన్నారు జాతిరత్నాలు మేకర్స్. ఈ సినిమా మహా శివరాత్రి రోజున అంటే మార్చ్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల అయింది. నిజానికి మొదటినుండి యువహీరో నవీన్ పొలిశెట్టి నటించిన జాతిరత్నాలు మూవీ ప్రత్యేక బజ్ క్రియేట్ చేసుకుందని చెప్పాలి. ఈ సినిమా రిలీజ్ ముందే ట్రైలర్, టీజర్, సాంగ్స్ తో అన్నివర్గాల వారి దృష్టిని ఆకర్షించింది. ఫస్ట్ డే నుండి థియేటర్లలో అద్భుతమైన కలెక్షన్స్ తో సక్సెస్ అందుకుంది. జాతిరత్నాలు మూవీ ఫస్ట్ డేనే ప్రీ-రిలీజ్ బిజినెస్ లో 40% కంటే ఎక్కువ వసూల్ చేసేసింది.
ఇక జాతిరత్నాలు మూవీ యూఎస్ కలెక్షన్స్ చూస్తే ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. మార్చి 11న అర్ధరాత్రికే ఈ సినిమా ఊహించని ఏరియాలలో 200కే డాలర్స్ (2లక్షల డాలర్స్) మార్కును దాటింది. ఇప్పటివరకు లాక్డౌన్ తర్వాత యూఎస్ లో రికార్డు బ్రేకింగ్ 1మిలియన్ క్లబ్ లో చేరింది. అయితే ఇప్పటివరకు జాతిరత్నాలు మూవీ 38.50 కోట్లు వసూల్ చేయగా.. వరల్డ్ వైడ్ 64 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసినట్లు సమాచారం. అంటే ఈ లెక్కన జాతిరత్నాలు మూవీ దాని బడ్జెట్ కంటే 350% ఎక్కువ వసూల్ చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అంటే టోటల్ గా జాతిరత్నాలు ట్రిపుల్ కలెక్షన్స్ తో సాలిడ్ హిట్ అందుకుంది. ఈ సినిమాను నాగ్ అశ్విన్ నిర్మించగా అనుదీప్ దర్శకత్వం వహించాడు. నవీన్ పొలిశెట్టి, ఫరియా అబ్దుల్లా, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధానపాత్రల్లో నటించారు.