మ‌న‌వ‌రాల్ని పెళ్లికాకుండానే ప్ర‌యోగం చేయ‌మంటోన్న జ‌యాబ‌చ్చ‌న్!

Update: 2022-10-30 04:15 GMT
భార‌త‌దేశంలో వివాహ వ్య‌వ‌స్థ అంటూ ఒక‌టుంది. పెళ్లి.. ఆ త‌ర్వాత పిల్లలు..సంసార జీవితం. ఇలా ఓ ప‌ద్ద‌తి ఉంది. భార‌త‌దేశంలో ఎంతో గొప్ప క‌ల్చ‌ర్ ఇది. ఇలాంటి విధానం ఉంటే బాగుండు! అనుకున్న దేశాలు చాలానే ఉన్నాయి. ఇలాంటి ఎన్నో విష‌యాల్లో భార‌త‌దేశాన్ని ఆద‌ర్శంగా తీసుకోవాల‌నుకున్న దేశాలున్నాయి. విదేశీ క‌ల్చ‌ర్కి పూర్తిగా భార‌త‌దేశం విరుద్దం.

అయినా  భార‌త‌దేశంలో ఉన్నంత స్వేచ్ఛ ఎక్క‌డా ఉండ‌దు కాబ‌ట్టి! ఇక్క‌డ ఎలా ఉన్నా?  చెల్లిపోతుంది. ఇక సెల‌బ్రిటీల వ్య‌క్తిగ‌త జీవితాల విష‌యాల‌కి వ‌స్తే! అందులోనూ బాలీవుడ్ క‌ల్చ‌ర్ లోకి వెళ్తే కొంత వ‌ర‌కూ విదేశీ సంస్కృతి క‌నిపిస్తుంది.  ఎమోష‌న్ ని బేస్ చేసుకుని జీవితానికి సంబంధించి నిర్ణ‌యాలు జ‌రుగుతుంటాయి.

తాజాగా లెజెండ‌రీ న‌టుడు  అమితాబ‌చ్చన్  స‌తీమ‌ణి జ‌యాబ‌చ్చ‌న్ కూడా మ‌న‌వ‌రాలు న‌వ్య నంద విష‌యంలో అలాంటి సంల‌చ‌న నిర్ణ‌య‌మే తీసుకున్న‌ట్లు క‌నిపిస్తుంది. పోడ్కాస్ట్ లో భాగంగా జ‌యాబ‌చ్చన్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసారు. న‌వ్య  వివాహం చేసుకోకుండా పిల్ల‌ల్నిక‌న్నా ప‌ర్వాలేదు. నాకు ఎలాంటి అభ్యంత‌రం లేదు.

పెళ్లి చేసుకునే పిల్ల‌ల్ని క‌నాలి అన్న‌డాన్ని నేను ఒప్పుకోను. పెళ్లికి ముందే పిల్ల‌ల్ని కంటే త‌ప్పే ముంది?  శారీర‌క బంధం చాలా ముఖ్యం. కేవ‌లం ప్రేమ‌..స‌ర్దుబాటుల‌తో బంధం నిల‌బ‌డ‌దు. మా టైమ్ లో ప్ర‌యోగాలు చేయ‌లేక‌పోయాం. క‌నీసం ఈత‌రం వాళ్లు అయినా చేయాలి. జీవన విధానం ఎంతో మారింది. దాంతో పాటు మ‌నం మారాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని` వ్యాఖ్యానించారు.

ఇంకా పెళ్లి విష‌యంలో బాగా తెలిసిన బెస్ట్ ప్రెండ్ని పెళ్లి చేసుకుంటా జీవితం సంతోషంగా ఉంటుంద‌న్నారు.  ఈ వ్యాఖ్య‌లు దేశ వ్యాప్తంగా కాక పుట్టించ‌డం ఖాయం.  ఎమీ జాక్స‌న్ ఇలాగా వివాహానికి ముందు పిల్ల‌ల్ని కంది. బ్ర‌ట‌న్  పౌర‌స‌త్వం ఉన్న బ్యూటీ అయినా ఇక్క‌డ సినిమాలు చేయ‌డంతో ఆమెపై తీవ్ర స్థాయిలో  నెగిటివిటీ స్పెడ్ అయింది. ఇప్పుడు ఏకంగా జ‌యాబ‌చ్చ‌న్ న‌వ‌త‌రం గురించి ఇలా మాట్లాడ‌టం..భార‌తీయ సంప్ర‌య‌దాల్నితుంగ‌లోకి తొక్కిన‌ట్లు క‌నిపిస్తుంద‌ని నెటి జ‌నులు మండిప‌డుతున్నారు.
Tags:    

Similar News