సెల్ఫీ అంటే బేవకూఫ్ అన్న నటి

Update: 2017-08-31 07:18 GMT
ఒక్కోసారి అభిమానులు పెట్టే ఇబ్బందికి కొందరు తారలు సడన్ సహనాన్ని కోల్పోతారు. ఇక కోపం తట్టుకోలేకపోతే అభిమానులకు దండం పెట్టిన చేతులతోనే చెంప చెళ్ళుమనించినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. రీసెంట్ గా ఇదే స్థాయిలో కోపాన్ని తెచ్చుకుంది ఓ సీనియర్ నటి.  బాలీవుడ్ లో ఒకప్పుడు అగ్రనటిగా కొనసాగిన జయ బచ్చన్ ఆ తర్వాత బిగ్ బి అమితాబ్ బచ్చన్ ని పెళ్లి చేసుకొని ప్రస్తుతం రాజ్యసభ సభ్యురాలిగా జీవితాన్ని కొనసాగిస్తోంది.  

అయితే అప్పుడప్పుడు మేడం గారు దూకుడు స్వబావంతో వార్తల్లో నిలుస్తారు. ఎక్కడికి వెళ్లినా కాస్త కోపంగానే దర్శనమిస్తుంటారు. రీసెంట్ గా ఆమె ఓ అభిమానిని తిట్టిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. గణేష్ ఉత్సవాల సందర్బంగా ముంబైలో మహా గణపతిని దర్శనం చేసుకునేందుకు ఒక ఆలయానికి ఆమె వచ్చారు. దర్శనం చేసుకున్న అనంతరం ఆమె ఇంటికి వెళ్ళడానికి కారు దగ్గరికి వెళ్లగా సడన్ గా ఒక అభిమాని వచ్చి ఆమెతో సెల్ఫీ దిగాలని కోరాడు. అవాక్కయిన జయ సీరియస్ గా చూస్తూ.. కోపంగా బేవకూఫ్ అని తిట్టేసారు. దీంతో అక్కడున్న వారందరు ఒక్కసారిగా షాక్ అయ్యారు.

జయ బచ్చన్ అనుచరులు అభిమానులను పక్కకు నెట్టేసి ఆమెను కారు దగ్గరకు తీసుకెళ్లారు. అయితే జయ మేడమ్ గారికి ఇలాంటి వివాదాలు కొత్తేమి కాదు ఆమె ఇంతకుముందు కూడా చాలా సార్లు ఇదే తరహాలో స్పందించింది. గతంలో పూజ చేస్తున్న ఓ పూజారి మేడమ్ ఒక సెల్ఫీ ఇవ్వరా ? అనగానే జయ.. ముందు పూజ సంగతి చుడండి అని అక్కడే గట్టిగా కౌంటర్ వేసి సీరియస్ వాతావరణాన్ని నెలకొల్పింది.    
Tags:    

Similar News