ఒకప్పటి మేటి కథానాయిక .. మెగాస్టార్ సరసన నటించిన బెస్ట్ స్టార్ ఇప్పుడు ప్రముఖ దర్శకుడి సినిమాలో విలన్ గా నటిస్తున్నారట. బాలీవుడ్ మీడియా సర్కిల్స్ లో ఇది హాట్ టాపిక్ గా మారింది. దేశంలోని టాప్ డైరెక్టర్లలో ఒకరిగా వెలిగిపోయిన కరణ్ జోహార్ ప్రస్తుతం `రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ` అనే భారీ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ బిగ్గీతో మరోసారి డైరెక్షన్ వైపు మళ్లేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఇటీవలే ఈ చిత్రం ముంబైలో ప్రారంభమైంది.
ఈ సినిమాలో టాప్ స్టార్లు కీలక పాత్రలు పోషిస్తుండగా.. మెగాస్టార్ అమితాబ్ సతీమణి.. నాటి మేటి కథానాయిక జయా బచ్చన్ నెగెటివ్ రోల్ లో కనిపించనున్నారని తెలుస్తోంది. ఇటీవల జయాజీ పెద్దగా సినిమాలు చేయకపోవటం చాలా ఆశ్చర్యకరం అనుకుంటే ఓ నెగెటివ్ రోల్ తో కంబ్యాక్ అవ్వడం ఆసక్తిని పెంచుతోంది. రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా భారీ ఎత్తున తెరకెక్కనుంది. ధర్మ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది.
ఇకపోతే నిర్మాతగా కరణ్ జోహార్ భారీ సినిమాలతో టై అప్ అయిన సంగతి తెలిసిందే. దోస్తానా సీక్వెల్ తో పాటు తెలుగు స్టార్ హీరో విజయ్ దేవరకొండను పాన్ ఇండియా స్టార్ ని చేస్తూ లైగర్ ని నిర్మిస్తున్నారు. పూరి-ఛార్మితో కలిసి కరణ్ పెట్టుబడులు పెడుతున్న సంగతి తెలిసిందే. జయా బచ్చన్ ని బాలీవుడ్ లో తిరిగి ఆయన రీలాంచ్ చేస్తుండడం ఆసక్తిని పెంచుతోంది.