యాక్షన్ ఎంటర్ టైనర్స్ తీస్తూ వరుస హిట్లు కొడుతున్న బోయపాటి - ఆగస్ట్ 11న జయజానకి నాయక తో మరోసారి ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమైయ్యాడు. బెల్లంకొండ శ్రీను - రకుల్ ప్రీత్ సింగ్ - ప్రగ్యజైస్వాల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా బిజినెస్ ఓ రేంజ్ లో జరిగిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం 45 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకి ఇప్పటికే టేబుల్ ప్రాఫిట్స్ అందుకుందని తెలిసింది.
తెలుగు శాటిలైట్ రైట్స్ 5.5 కోట్లకి అమ్ముడైనట్లు టాక్. అలానే హిందీ డబ్బింగ్ రైట్స్ 7 కోట్లకి - నైజాం 9.5 కోట్లకి - ఆంధ్ర ఏరియా మొత్తం 20 కోట్లకి, సీడెడ్ 7.2 కోట్లకి సేల్ అయినట్లుగా చిత్ర వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ మొత్తం బిజినెస్ - దర్శకుడు బోయపాటి శ్రీనుకి ఉన్న క్రేజ్ కారణంగానే జరిగిందని సినీ జనాలు అంటున్నారు. సరైనోడు వంటి బ్లాక్ బస్టర్ తరువాత బోయపాటి ఈ ప్రాజెక్ట్ ని డీల్ చేయడం, అలానే ఇటీవలే విడుదలైన ఈ సినిమా టీజర్లకి సోషల్ మీడియాలో విపరీతమైన రెస్పాన్స్ రావడంతో జయజానకినాయక రేటు మార్కెట్ లో బాగా పెరిగింది. ఏదిఏమైనా బోయపాటి టాలెంట్ అండ్ సపోర్ట్ తో ఈ సినిమా ప్రస్తుతానికి సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయింది. మరి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ఏ రీతిన రిసీవ్ చేసుకుంటారో లెట్స్ వెయిట్ అండ్ సీ.