సీనియర్ నటి జయలలిత పేరెత్తగానే ఆమె చేసిన వ్యాంప్ పాత్రలే గుర్తుకొస్తాయి. వందల సినిమాల్లో నటించిన జయలలిత.. చాలా వరకు ఆ తరహా పాత్రలే చేసింది. దీంతో ఆమెకు ఆ ఇమేజ్ స్థిరపడిపోయింది. అలాంటి నటిని తీసుకొచ్చి ‘భరత్ అనే నేను’ సినిమాలో అసెంబ్లీ స్పీకర్ కుర్చీలో కూర్చోబెట్టేశాడు దర్శకుడు కొరటాల శివ. ఇది ప్రేక్షకులకు పెద్ద షాకే. ఈ పాత్రకు జయలలితను ఎంచుకోవాలన్న ఆలోచన అసలు కొరటాలకు ఎలా వచ్చిందా అని అందరూ ఆశ్చర్యపోయారు. ఈ విషయమై ‘భరత్ అనే నేను’ సక్సెస్ మీట్లో జయలలిత చాలా ఉద్వేగంగా స్పందించింది. ఒక యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో కొరటాల తన గురించి చెప్పిన మాటల గురించి ఆమె ప్రస్తావించింది.
అందరూ వ్యాంప్ లాగా చూసే జయలలితలో మీరు స్పీకర్ ను ఎలా చూశారు అని అడిగితే.. అందరూ ఆమెలో వ్యాంప్ ను చూశారు.. నేను మాత్రం అమ్మను చూశాను అని కొరటాల చెప్పాడని.. ఆ మాటలు వినగానే ఆనందంతో.. ఉద్వేగంతో తాను బోరున ఏడ్చేశానని జయలలిత చెప్పారు. వచ్చే జన్మంటూ ఉంటే కొరటాల తన కొడుకుగా పుట్టాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాననంటూ ఆమె ఎమోషనల్ అయ్యారు. ఇన్నేళ్ల తర్వాత తాను ఇలాంటి పాత్ర చేస్తానని ఊహించలేదని ఆమె అన్నారు. తనకు ఇలాంటి పాత్ర ఇచ్చినందుకు అతడికి రుణపడి ఉంటానని ఆమె అన్నారు. ఈ సందర్భంగా కొరటాల తల వంచి ఆమెకు నమస్కరించాడు. ఇక మహేష్ బాబు కృష్ణ గారి అందాన్ని.. మంచి మనసును పుణికి పుచ్చుకున్నాడని.. అతడి తొలి సినిమా ‘రాజకుమారుడు’లో తాను నటించానని.. మళ్లీ ఇన్నేళ్లకు అతడితో సినిమా చేసే అవకాశం వచ్చిందని చెప్పారు. ‘భరత్ అనే నేను’లో స్పీకర్ పాత్రను తానెప్పటికీ మరిచిపోలేనని ఆమె అన్నారు.