ఓ ప్రాజెక్టు మొదలుపెట్టేందుకు ముందే టైటిల్స్ రిజిస్ట్రేషన్ చేయించడం టాలీవుడ్ లో కొన్ని సార్లు మాత్రమే జరుగుతుంది. చివరకు ఇలా రిజిస్ట్రేషన్ చేయించిన టైటిల్ నే పెట్టాలనే రూల్ ఏమీ లేదు కానీ.. చాలావరకూ మాత్రం టైటిల్ కు కట్టుబడి ఉంటారు. ఇప్పుడు హైద్రాబాద్ లోని ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ అయిన టైటిల్స్ ఆసక్తికరంగా ఉన్నాయి.
రామ్ చరణ్ తన బ్యానర్ కొణిదెల ప్రొడక్షన్స్ పై 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' టైటిల్ ను రిజిస్టర్ చేయించాడు. ఇది మెగాస్టార్ చిరంజీవితో.. సురేందర్ రెడ్డి తీయనున్న మూవీ అనే విషయంపై ఇప్పటికే జనాల్లో కూడా క్లారిటీ ఉండగా.. త్వరలో సినిమాకు సంబంధించిన అనౌన్స్ మెంట్ రాబోతోంది కూడా. నిర్మాత సి కళ్యాణ్ 'జయ సింహ' అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించారు. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కే చిత్రమే ఈ జయసింహ అని తెలుస్తోంది.
ప్రేమమ్.. బాబు బంగారం వంటి చిత్రాలను తీసిన సితార ఎంటర్టెయిన్మెంట్స్.. 'అదిగో అల్లదిగో శ్రీహరివాసం' అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించింది. మరోవైపు.. అల్లరి నరేష్ నెక్ట్స్ మూవీ కోసం 'పక్కింటి అబ్బాయి' పేరును రిజిస్టర్ చేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/