తమిళ హీరో సినిమా పై తెలుగు నిర్మాతల మండలి లో ఫిర్యాదు

Update: 2022-08-31 15:30 GMT
ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాలు ఇతర భాషల్లో విడుదల అవ్వడం కామన్ అయ్యింది. ఇక తెలుగు సినిమాల మాదిరిగానే తమిళ సినిమాలు ఇతర భాషల్లో విడుదల అవ్వడం జరుగుతుంది. ఎక్కువ శాతం సినిమాల యొక్క టైటిల్స్ అన్ని భాషల్లో ఒకే విధంగా ఉండే విధంగా ప్లాన్‌ చేస్తున్నారు. తమిళ యంగ్‌ హీరో జయం రవి యొక్క సినిమాకు ఇప్పుడు అదే సమస్యగా మారింది.

త్వరలో పొన్నియన్‌ సెల్వన్‌ సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న జయం రవి తాజాగా సైరన్ అనే సినిమాను మొదలు పెట్టాడు. తెలుగు లో కూడా అదే టైటిల్ తో విడుదల చేయబోతున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రకటించారు. తెలుగు మరియు తమిళంలో ఒకే సారి ఈ సినిమాను ఒకే టైటిల్ తో విడుదల చేయబోతున్నట్లుగా చేసిన ప్రకటన ఇప్పుడు వివాదం కు దారి తీసింది.

అసలు విషయం ఏంటీ అంటే తెలుగు లో ఇప్పటికే సైరన్ అనే సినిమా రూపొందుతోంది. ఆ సినిమా కోసం టైటిల్స్ ను రిజిస్ట్రర్ చేయించారట. వారు ఇప్పుడు నిర్మాతల మండలి లో తమిళ సినిమాను సైరన్ టైటిల్ తో రిలీజ్ చేస్తే తమ పరిస్థితి ఏంటీ అంటూ ప్రశ్నిస్తున్నారు.

ఇప్పటికే షూటింగ్‌ ప్రారంభించిన తమ సినిమా టైటిల్ తోనే వారు కూడా సినిమాను తీసుకు వస్తే మాకు నష్టం అంటూ నిర్మాతల మండలి లో ఫిర్యాదు చేశారు.

ఇప్పుడు జయం రవి యొక్క సినిమా కి టైటిల్ ను మార్చబోతున్నారా లేదంటే ఆ సినిమా యూనిట్‌ సభ్యులతో ఏమైనా చర్చలు జరిపి రాజీ కుదుర్చుకుంటారా అనేది చూడాలి. హీరో జయం రవి కి తెలుగు లో ఉన్న క్రేజ్‌ అంతంత మాత్రం. అలాంటి జయం రవి సినిమా తెలుగు లో విడుదల అయితే ఏదో ఒక వివాదం వల్ల ఆ సినిమాకు మరింత నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయంటూ అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News