హాలీవుడ్ సినిమాలు ఫాలో అయ్యేవరకి ‘జాంబీ’ జానర్ సినిమాలు పరిచయం ఉండే ఉంటాయి. మనిషి శరీరంలోకి వైరస్ పాకిపోవడం వల్ల జంతువుల్లా మారి చిత్రంగా ప్రవర్తించే నేపథ్యంలో హాలీవుడ్లో అప్పుడప్పుడూ సినిమాలు వస్తుంటాయి. ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో ఈ తరహా సినిమాలు తెరకెక్కాయి. హాలీవుడ్ సూపర్ స్టార్ విల్ స్మిత్ నటించిన ‘ఐయామ్ లెజెండ్’ మూవీ ఈ జానర్ సినిమాలకు సరైన ఉదాహరణ. ఇప్పుడు ఇండియాలోనూ ఆ తరహా సినిమా వస్తోంది. అది కూడా ఓ ప్రాంతీయ భాషలో ‘జాంబీ’ జానర్ మూవీ తెరకెక్కడం విశేషం. ప్రయోగాలకు పెట్టింది పేరైన తమిళ భాషలో ఈ తరహా సినిమా తయారైంది. ఆ చిత్రం పేరు.. ‘మిరుదన్’.
ఈ ఏడాది ‘తనీ ఒరువన్’తో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టిన జయం రవి హీరోగా నటించిన సినిమా ఇది. శక్తి సౌందర్ రాజన్ అనే యువ దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించాడు. నూతన సంవత్సర కానుకగా విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ తమిళనాట సెన్సేషన్ అవుతోంది. చెన్నై నగరంలో వైరస్ ప్రభావంతో జంతువుల్లా మారిపోయిన మనుషులు మిగతా వాళ్లపై దాడి చేసే నేపథ్యంలో హీరో అందరినీ ఎలా కాపాడాడనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. ట్రైలర్ చూస్తుంటే ‘ఐయామ్ లెజెండ్’ సినిమాలు గుర్తుకొస్తున్నాయి కానీ.. ఈ తరహా సినిమాలు ఇండియన్ స్క్రీన్ మీద రావడం అరుదైన విషయమే. ఈ నెల 15న సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
Full View