ట్రైలర్ టాక్: సింపుల్ గా.. కానీ కొంచెం స్లోగా

Update: 2016-11-14 02:41 GMT
కమెడియన్ నుంచి హీరోగా అప్ గ్రేడ్ అవుతున్న శ్రీనివాసరెడ్డి కొత్త సినిమా జయమ్ము నిశ్చయమ్మురా. ఫస్ట్ లుక్ నుంచి ఆసక్తి కలిగించిన ఈ చిత్రానికి.. ఇప్పుడు థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ అయింది. ఇప్పటికే ట్రేడ్ వర్గాల్లో బజ్ క్రియేట్ చేయడంతో పాటు.. చెప్పుకోదగ్గ స్థాయిలో బిజినెస్ కూడా కూడా చేసిందీ జయమ్ము నిశ్చయమ్మురా.

ట్రైలర్ ప్రారంభంలోనే 2013లో.. తెలుగు ప్రజలంతా ఒక రాష్ట్రంగా ఉన్నపుడు అంటూ.. అసలు థీమ్ చెప్పేశారు. కష్టపడి గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించిన కరీంనగర్ కుర్రాడికి.. కాకినాడలో పోస్టింగ్ వస్తుంది. ఇంకా జాబ్ లో జాయిన్ కాకుండానే.. కరీంనగర్ కి ట్రాన్స్ ఫర్ ఎలా అవుతుంది అనే కేరక్టర్. అక్కడ ఆఫీస్ లో లంచావతారాలు.. ట్రాన్స్ ఫర్ కోసం హీరో చేసే ప్రయత్నాలు.. మధ్యలో హీరోయిన్ పూర్ణకు లైన్ వేయడాలు.. యధావిధిగా హీరోకు ఎదురయ్యే కష్టాలు.. హీరోయిన్ ఇంకొకరికి దగ్గరైపోయే పరిస్థితులు.. వీటన్నిటినీ ఎదుర్కోవడం ఆత్మవిశ్వాసంతోనే సాధ్యం అంటూ ట్రైలర్ ఫినిష్ చేయడం.. ఏం జరిగిందో ఊహించడం తేలికే కానీ.. ఎలా అన్నది తెలియాలంటే సినిమా చూడాలన్న మాట.

జయమ్ము నిశ్చయమ్మురా స్టోరీ థీమ్ బాగానే ఉందని చెప్పాలి. పూర్తిగా పల్లెటూరి నేటివిటీ తీసేందుకు చేసిన ప్రయత్నాన్ని పొగడాలి. కానీ ట్రైలర్ ను లెంగ్తీగా కట్ చేయడం కారణంగా.. కామెడీ సీన్స్ తో నింపే ఎటెంప్ట్ జరిగింది. సినిమాలో బోలెడంత కామెడీ ఉందని చెప్పే ప్రయత్నం అన్నమాట. స్టోరీ అంతా చెప్పేయడం ఆశ్చర్యం కలిగిస్తే.. ట్రైలర్ బాగా లెంగ్తీగా ఉండడం.. సన్నివేశాలు స్లోగా సాగినట్లు ఉండడం నిరాశ కలిగించే అంశాలు. ఓవరాల్ గా మాత్రం కరీంనగర్ కుర్రాడు- కాకినాడ అమ్మాయి కథ ఇంట్రెస్టింగ్ గానే కనిపిస్తోంది.
Full View


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News