కమల్ హాసన్ డాక్టరే అల్లు అర్జున్ డాడీ

Update: 2019-04-19 05:28 GMT
సరిగ్గా 19 ఏళ్ళ క్రితం కమల్ హాసన్ హీరోగా తెనాలి అనే సినిమా వచ్చింది. అందులో హీరోకు బుద్దిమాంద్యం ఉంటే దాన్ని తగ్గించే డాక్టర్ గా మలయాళం హీరో జయరాం అద్భుతంగా నటించాడు. రాజేంద్ర ప్రసాద్ డబ్బింగ్ చెప్పారంటేనే అర్థం చేసుకోవచ్చు అప్పట్లో జయరాం రేంజ్ ఏమిటో. అక్కడ ఎంత పెద్ద స్టార్ అయినా ఈయన మనవాళ్లకు తెలిసింది చాలా తక్కువ. మళ్ళి ఇన్నాళ్లకు టాలీవుడ్ లో డైరెక్ట్ ఎంట్రీ ద్వారా పరిచయం కాబోతున్నాడు.

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న మూవీలో జయరాం నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో చాలా కీలకమైన తండ్రి పాత్ర ఆయన చేస్తున్నట్టు తెలిసింది. ఇన్నేళ్ల కెరీర్ లో జయరాంకు ఇది మొదటి తెలుగు సినిమా. కేరళ స్టార్లు మమ్ముట్టి-మోహన్ లాల్-సురేష్ గోపి ఇంతకు ముందే చేశారు కానీ ఈయనే లేట్.

ఈ లెక్కన టబు పక్కన జోడిగా కనిపించేది జయరామే అన్న క్లారిటీ వచ్చేసినట్టే. కాకపోతే రెండు టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. అలకనంద-నేను నాన్న అనే పేర్లలో ఏదో ఒకటి ఫిక్స్ కావొచ్చని టాక్ ఉంది. ఒకటి తల్లి పాత్రను ఆధారంగ చేసుకుని ఉండగా రెండోది ఫాదర్ సెంటిమెంట్ ని హై లైట్ చేస్తోంది. మరి త్రివిక్రమ్ ఏ సెంటిమెంట్ టచ్ తో కథ రాసుకున్నాడో ప్రస్తుతానికి క్లారిటీ లేదు. జయరాం పాత్ర హై లైట్ అవుతుందని త్రివిక్రమ్ దర్శకుడిగా మొదటి సినిమా నువ్వే నువ్వేలో ప్రకాష్ రాజ్ తరహాలో కథలో చాలా కీలకమనే టాక్ అయితే ఉంది. ఇంకొద్ది రోజులు ఆగితే క్లారిటీ రావొచ్చు
    

Tags:    

Similar News