ఒకప్పుడు స్టార్ హీరోయిన్ - ఇప్పుడు స్టార్ నటి ఆమె. సహజ నటిగా గుర్తింపు దక్కించుకున్న జయసుధ ప్రస్తుతం స్టార్ హీరోలకు తల్లి పాత్రలో నటిస్తూ ఇంకా బిజీగానే ఉన్నారు. తాజాగా జయసుద సూపర్ స్టార్ మహేష్ బాబుకు 'మహర్షి' చిత్రంలో తల్లి పాత్రను పోషించిన విషయం తెల్సిందే. ఆ సినిమా విడుదలకు సిద్దం అవుతోంది. తాజాగా జయసుధ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మెగా హీరోల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
మహేష్ బాబుతో పలు సినిమాల్లో నటించారు కదా - ఆయనకు మెగా హీరోలకు తేడా ఏమిటి అంటూ యాంకర్ ప్రశ్నించిన సమయంలో మెగా హీరోలు అంటే ఎవరు అంటూ ప్రశ్నించింది. చిరంజీవి ఫ్యామిలీ హీరోలు మెగా హీరోలు అంటూ యాంకర్ చెప్పగా - మీరు - ప్రేక్షకులు హీరోలను విడదీసి చూస్తారు. కాని మేము మాత్రం అలా చూడం. ఒకసారి సెట్స్ లోకి వెళ్లాం అంటే అంత కోస్టార్స్ గానే వ్యవహరిస్తాం. అందరు హీరోల మాదిరిగానే ఆ హీరోలను చూస్తాం, వారిని ప్రత్యేకంగా ఏమీ చూడం అంది.
ఒక సినిమాలో నటించబోతున్న సమయంలో కొత్త హీరోనా, పెద్ద హీరోనా, అప్ కమింగ్ హీరోనా అనే విషయాలను చూస్తాను తప్ప ఆయన ఏ ఫ్యామిలీ హీరో అనే విషయంను చూడను అంటూ చెప్పుకొచ్చింది. మెగా హీరో, ఆ హీరో అనే తేడా లేదు. మేము ఎంతో మంది స్టార్స్ ను చూశాం, మెగా మెగాలతోనే వర్క్ చేశాను, ఎన్టీఆర్ వంటి నటుడి నుండి ఇప్పటి వరకు ఎంతో మందిని చూస్తూ వచ్చాను. ఇదో పెద్ద మ్యాటర్ కాదు అంది. సినిమా సెట్ లో మెగా హీరోలు, ఆ హీరోలు అనేవి ఏమీ ఉండవు, మెగా హీరో అయినా, కొత్తగా వచ్చిన వారైనా, మరే ఫ్యామిలీ నుండి వచ్చిన వారైనా కూడా కెమెరా ముందు తలవంచాల్సిందే. ఏ ఫ్యామిలీ నుండి వచ్చిన వారు అయినా కూడా ఒక క్యారెక్టర్ ను పండిస్తేనే వర్కౌట్ అవుతారు.
మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన కొందరు హీరోలు చాలా హంబుల్ గా ఉంటారు, కాని ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన వారు కూడా కొందరు యాటిట్యూడ్ చూపించేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. రామ్ చరణ్ సెట్స్ లో ఉంటే చిరంజీవి గారి కొడుకులా కాకుండా రామ్ చరణ్ మాదిరిగానే చూస్తాను, కృష్ణ గారి అబ్బాయి అని కాకుండా మహేష్ ను మహేష్ లాగే చూస్తాను అంది. ఒక హీరోకు తల్లి పాత్రలో నటిస్తే రెండు మూడు రోజుల్లో ఆ హీరో నా కొడుకుగా భావించి నటిస్తాను. అలా నటిస్తేనే పాత్ర పండుతుందని నేను భావిస్తాను. సీనియర్ హీరోలు, జూనియర్ హీరోలు అనే తేడాను నేను ఎప్పుడు పట్టించుకోను అంది.