ఆ ఇంటెన్స్‌ విలనీకి ఎగ్రెస్సివ్ నాయ‌కుడే స్ఫూర్తి

Update: 2020-01-17 04:10 GMT
సినిమాల్లో పాత్ర‌ల్ని ఎలా పుట్టిస్తారు?   విల‌న్.. క‌మెడియ‌న్.. హీరో .. క్యార‌క్ట‌ర్ ఆర్టిస్ట్.. పాత్ర ఏదైనా ర‌చ‌యిత మైండ్ లోంచి పుట్టి ద‌ర్శ‌కుడి మైండ్ లోకి ప్ర‌వేశిస్తుంది. అయితే దర్శ‌క‌ర‌చ‌యిత‌లు ఇరువురూ ఈ ప్రాసెస్ లో ఆ పాత్ర‌ను పూర్తిగా వోన్ చేసుకుని తెరపై ఎలా వ‌ర్క‌వుట‌వుతుందో ఊహించాలి. ద‌ర్శ‌కుడు అనుకున్న‌ది అనుకున్న‌ట్టు చూపించాలి. అయితే అస‌లు పాత్ర‌ను పుట్టించ‌డం ఎలా? అంటే.. రియ‌ల్ గా లైవ్ గా చూసిన కొంత మంది రియ‌ల్ క్యారెక్ట‌ర్ల‌నే వెండితెర‌పైకి తేవ‌డం సిస‌లైన ట్యాలెంట్ అని చెప్పాలి. ఈ త‌ర‌హాలో మ‌న స్టార్ డైరెక్ట‌ర్లు స్ఫూర్తివంత‌మైన పాత్ర‌లెన్నిటినో సృజించారు. పూరి- శ్రీ‌నువైట్ల‌- త్రివిక్ర‌మ్ వంటి సీనియ‌ర్లు.. వీళ్ల బాట‌లోనే అనీల్ రావిపూడి రియ‌ల్ లైఫ్ క్యారెక్ట‌ర్ల నుంచి స్ఫూర్తి పొంది పాత్ర‌ల్ని రూపొందించ‌డంలో సిద్ధ‌హ‌స్తులు.

తాజాగా సంక్రాంతి కానుక‌గా రిలీజైన `స‌రిలేరు నీకెవ్వ‌రు` చిత్రంలో విల‌న్ ప్ర‌కాష్ రాజ్ పాత్ర‌కు స్ఫూర్తి ఏది? అంటే.. అందుకు అనీల్ రావిపూడి ర‌చ‌యిత‌ల‌ బృందం నుంచి ఓ లీక్ అందింది. ఆ పాత్ర‌కు ప్ర‌ముఖ రాజ‌కీయ నాయ‌కుడు జేసీ దివాక‌ర్ రెడ్డి స్ఫూర్తి అని తెలిసింది. తేదేపా నాయ‌కుడు .. మాజీ ఎంపీగా దివాక‌ర్ రెడ్డి సుప‌రిచితం. జేసీ ట్రావెల్స్ ఎంత ఫేమ‌స్సో తెలిసిందే. రాయ‌ల‌సీమ‌కు చెందిన ఈ నాయ‌కుడి స్ఫూర్తితోనే ప్ర‌కాష్ రాజ్ పాత్ర‌ను డిజైన్ చేశార‌ని తెలుస్తోంది.

క‌డ‌ప - కొండారెడ్డి బురుజు వంటి వాటి సృజ‌న‌కు ఈ పాత్ర‌నే స్ఫూర్తి. క‌శ్మీర్ నుంచి క‌డ‌ప వ‌ర‌కూ క‌థ‌ను న‌డిపించ‌డంలో అనీల్ రావిపూడి తెలివైన ట్రాక్ ని న‌డిపించారు. ఆయ‌న‌కు యావ‌రేజ్ మార్కులే వేసినా.. సంక్రాంతి సీజ‌న్ అన్నిర‌కాలుగా ఈ సినిమాకి క‌లిసొచ్చింద‌న్న టాక్ ఉంది.  యాస‌.. భాష‌.. మాండ‌లీకం .. ఇలా ప్ర‌తిదీ ప్ర‌కాష్ రాజ్ పాత్ర‌ను చూస్తే జేసీనే గుర్తుకు రావాలి. ఆ ఎగ్రెస్సివ్.. ఇంటెన్స్ ఎమోష‌న్ కొత్త‌గా కుద‌ర‌డానికి కార‌ణం జేసీని ఇమాజినేట్ చేసుకుని ఆ పాత్ర‌ను రూపొందించ‌డ‌మే కార‌ణం.

    

Tags:    

Similar News