తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన జేడీ చక్రవర్తి ఈమద్య కాలంలో కాస్త తక్కువగా కనిపిస్తున్నాడు. తెలుగు సినిమాల్లో ఈమద్య తక్కువ కనిపిస్తున్న జేడీ చక్రవర్తి ఎట్టకేలకు 'హిప్పి' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు. 'ఆర్ ఎక్స్ 100' చిత్ర హీరో కార్తికేయ హీరోగా నటించిన 'హిప్పి' చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. సినిమా ప్రమోషన్ లో భాగంగా కీలక పాత్రలో నటించిన జేడీ చక్రవర్తి మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. తాజాగా ఒక వెబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చాడు.
టాలీవుడ్ హీరోలతో తనకున్న స్నేహం మరియు వారి వ్యక్తిత్వాల గురించి జేడీ మాట్లాడాడు. ఎన్టీఆర్ గురించి జేడీ మాట్లాడుతూ చాలా ప్రతిభ ఉన్న నటుడు. నిలువెళ్ల ప్రతిభ ఉన్న వ్యక్తి తారక్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే అతడు ఒక్కోసారి అవతలి వారిని టెన్షన్ పెట్టే తీరు మరీ భయంకరంగా ఉంటుంది. ఒకసారి నేను తారక్ కారు ఎక్కాను. అప్పుడు తారక్ మేఘాలలో అనే పాట పెట్టి కారును కళ్లు మూసుకుని 110 కిలోమీటర్ల వేగంతో నడిపాడు. ఆ సమయంలో నేను ఎంత టెన్షన్ పడ్డానో చెప్పలేను. జీవితంలో అంతకు ముందు, ఆ తర్వాత అంతలా టెన్షన్ పడలేదు. ఆ పాట ఎందుకు చేశానా అన్నంతగా నాపై నాకు ఆ సమయంలో కోపం వచ్చిందని నవ్వుతూ చెప్పుకొచ్చాడు.
ఇక మొన్న జరిగిన ఎన్నికల్లో పవన్ గెలిచి ఉంటే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తం చేశాడు. జగన్ సీఎం అవ్వడం సంతోషమే.. అలా అని చంద్రబాబు నాయుడు ఓడిపోవడం నాకు సంతోషంగా ఏమీ లేదని.. ప్రజలు మార్పు కోసం చూశారు. వారి నిర్ణయం గౌరవించాలని అన్నాడు. చిరంజీవి గారిని చూస్తే ఎనర్జి గుర్తుకు వస్తుంది.. బాలయ్య బాబు గారిలో కాన్ఫిడెన్స్ నచ్చుతుంది. నాగార్జున గారు స్వీట్ పర్సన్.. వెంకటేష్ గారి బ్రాడ్ షోల్డర్స్ ఇష్టం అన్నాడు. మహేష్ బాబు గారు 'పోకిరి' వంటి సినిమాలు చేయడం నాకు ఇష్టం. ఆయన ఆ సినిమాలో తన సహజ పద్దతిలో కనిపించాడు. అందుకే ఆ సినిమా నాకు ఇష్టం అన్నాడు.