సెన్సార్ రూల్స్ పై కొత్త బుక్ రాయాలి

Update: 2019-06-02 08:12 GMT
సెన్సార్ నియ‌మ‌నిబంధ‌న‌ల వ‌ల్ల ఫిలిం మేక‌ర్స్ స్వేచ్ఛ హ‌రించుకుపోతోందా? ఓవైపు సాంప్ర‌దాయ వాదులు .. సంస్కారులు సెన్సార్ స‌రిగా ప‌ని చేయ‌డం లేద‌ని.. అందువ‌ల్ల‌నే సినిమాల్లో బూతు విచ్చ‌ల‌విడిగా పెరిగిపోతోంద‌ని వాదిస్తుంటే .. ఆయ‌న మాత్రం సెన్సార్ రూల్స్ మారుస్తూ కొత్త బుక్ రాయాల‌ని వాదిస్తున్నారు. ఇంత‌కీ ఎవ‌రాయ‌న‌? అంటే ఆర్జీవీ శిష్యుడు.. మూడు ద‌శాబ్ధాల అనుభ‌వం ఉన్న‌ సీనియ‌ర్ న‌టుడు జేడీ చ‌క్ర‌వ‌ర్తి.

``సెన్సార్ ఇదివ‌ర‌కూ కంటే బావుంది. సెన్సార్ కి కొన్ని గైడ్ లైన్స్ రాశారు. సెన్సార్ పాటించేవాళ్ల‌ను త‌ప్పు ప‌ట్ట‌కూడ‌దు. గైడ్ లైన్స్ పై రీవ‌ర్క్ చేసి కొత్త బుక్ రాస్తే బెట‌ర్ గా ఉంటుంది`` అని జేడీ అన్నారు. ``సెన్సార్ అధికారుల్ని తిట్టుకుంటే లాభం లేదు. ఆ పుస్త‌కాన్ని మార్చి కొత్త బుక్ వ‌చ్చేందుకు మీరంతా కృషి చేయాలి. కొత్త రూల్స్ తో బుక్ రాయాలి`` అని అభిప్రాయం వ్య‌క్తం చేశారు. ఇప్పుడున్న రూల్స్ బుక్ వ‌ల్ల‌నే సినిమాల మేకింగ్ లో పూర్తి స్వేచ్ఛ లేకుండా పోయింద‌ని.. అయితే ఈ విష‌యంలో సెన్సార్ అధికారుల్ని ఏమీ అన‌లేమ‌ని జేడీ అన్నారు. వాళ్లు వారి ఉద్యోగం చేస్తున్నార‌ని అన్నారు. రూల్స్ బుక్ లో ఉన్న వాటిని కాద‌ని వారు ఏదీ చెయ్య‌లేర‌ని సింప‌థీ చూపించారు. నేటి ట్రెండ్ కి త‌గ్గ‌ట్టుగానే రూల్స్ బుక్ మార్చాల‌ని.. కొత్త రూల్స్ తో పుస్త‌కం రాసిన‌ప్పుడే ఫిలింమేక‌ర్స్ కి స్వేచ్ఛ పెరుగుతుంద‌ని త‌న అభిప్రాయం చెప్పారు. అంతేకాదు కొత్త రూల్స్ బుక్ రాసి దానిని ప్ర‌మోట్ చేయాల‌ని అందుకు మీడియా సాయ‌ప‌డాల‌ని జేడీ కోర‌డంపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. సెన్సార్ రూల్స్ మారాలి. అప్పుడే సినిమా మారుతుంద‌ని జేడీ సూచించ‌డాన్ని సీబీఎఫ్‌ సీ ప‌ట్టించుకుంటుందా? అన్న‌ది వేచి చూడాలి.

జేడీ చ‌క్ర‌వ‌ర్తి - కార్తికేయ గురుశిష్యులుగా న‌టించిన హిప్పీ జూన్ 6న (గురువారం) ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్ ద‌స‌ప‌ల్లాలో తెలుగు సినీమీడియాతో ముచ్చ‌టిస్తూ జేడీ పై సంగ‌తుల్ని తెలిపారు. హిప్పీ చిత్రంలో జేడీ ఎంతో ప్ర‌త్యేక‌మైన పాత్ర‌లో న‌టించాన‌ని తెలిపాడు. ఈ సినిమాలో రొమాన్స్ .. పెద‌వి ముద్దులు.. అర్థ‌న‌గ్న సన్నివేశాలే కాదు.. ఇది ఓ విభిన్న‌మైన ప్రేమ‌క‌థా చిత్రం. ఒక ల‌వ్ స్టోరీని బోల్డ్ గా తెర‌పై చూడొచ్చు అని జేడీ తెలిపారు. కార్తికేయకు గురువు పాత్ర‌లో న‌టించాను. న‌న్ను ఎంతో ఎగ్జ‌యిట్ చేయ‌డం వ‌ల్ల‌నే ఈ చిత్రంలో న‌టించాను. ద‌ర్శ‌కుడు టి.ఎన్.కృష్ణ ఫ్రెష్ కంటెంట్ తో కొత్త పాయింట్ తో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాడు. ఎంతో డెడికేష‌న్ .. క్లారిటీ ఉన్న ద‌ర్శ‌కుడు అని జేడీ ప్ర‌శంసించారు. త‌న‌కు ఏం కావాలో అది మాత్ర‌మే తీసుకునే ద‌ర్శ‌కుడు కృష్ణ అంటూ పొగిడేశారు. ఇక నిర్మాత క‌ళైపులి ఎస్.థాను మోడ్ర‌న్ ఏజ్ ప్రొడ్యూస‌ర్.. త‌న‌తో ప‌ని చేసేందుకు స్టార్లు ఎదురు చూస్తార‌ని.. నిర్మాత‌ని పొగ‌డాల్సిన అవ‌స‌రం త‌న‌కు లేద‌ని.. ఆయ‌న స్వ‌భావం గురించి చెబుతున్నాన‌ని జేడీ అన్నారు.


Tags:    

Similar News