అడిగే దమ్ము ఉండాలే కానీ.. విషయం ఏదైనా ముఖం మీదే చెప్పేసే టాలీవుడ్ నటుడు ఎవరైనా ఉన్నారంటే అది జేడీ చక్రవర్తి మాత్రమే. జర్నలిస్టు దమ్ము ఎంతన్న విషయం ఆయన దగ్గర మాత్రం చిన్నబోతుంది. ఎందుకంటే.. అడిగినోడికి అడిగినంత మహదేవ అన్నట్లు ఆయన ఫ్రాంక్ గా ఉంటారు. రిపోర్టర్ అడిగితే ఏ విషయం మీదనైనా సమాధానం చెప్పేసే జేడీతో ఇష్యూ కన్నా.. దాన్ని రాస్తే ఆఫీసులో ఎదురయ్యే ఇబ్బందులే ఎక్కువ. ఆ విషయం ఇప్పటికే పలువురు రిపోర్టర్లకు సుపరిచితం.
ఇటీవల సినిమాలు తగ్గించిన ఆయన తాజాగా హిప్పీ మూవీతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. తెలుగులో చాలా అవకాశాలు వచ్చినా.. ఏ కథ తనను ఉత్సాహపర్చలేదని.. అందుకు భిన్నంగా హిప్పి తనను ఆకట్టుకున్నట్లు చెప్పాడు. సినిమా గురించి చెబుతూ.. తానో ప్లేబాయ్ లా నటిస్తున్న విషయాన్ని చెప్పారు.
ప్రేమకు.. ఆకర్షణకు మధ్యనున్న తేడా చెప్పే సినిమాగా చెప్పిన జేడీ.. తన గురువు రాంగోపాల్ వర్మ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన గురువు వర్మ తనకు డబ్బులు సంపాదించటం తప్ప అన్నీ నేర్పారని.. డబ్బుల కోసం తాను సినిమాలు చేయనని స్పష్టం చేశారు. రేపటి షూటింగ్ ఎలా ఉండబోతోందన్న ఉత్సాహం కలిగించే సినిమాల్లోనే తాను నటిస్తానని చెప్పారు.
తెలుగులో గుర్తుండిపోయే పాత్రలు ఎందుకు లభించలేదన్న విషయాన్ని ఒక ఉదాహరణతో సింఫుల్ గా చెప్పేశాడు. హాలీవుడ్ లో కొన్ని పాత్రల చుట్టూ కథ నడుస్తుందని.. కానీ తెలుగులో మాత్రం హీరో చుట్టూ కథ తిరుగుతుందని.. అందుకు ఇక్కడ గుర్తుండిపోయే పాత్రలు దక్కట్లేదని తేల్చేశాడు. ఎంత బోల్డ్ గా విషయాన్ని చెప్పేశాడో కదా. దటీజ్ జేడీ!