వివాదాల ఆర్జీవీ నిరంతరం ఏదో ఒక సెన్సేషన్ లేనిదే నిదురపోడన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా తన సినిమాల ప్రమోషన్ కోసం ఏదో ఒక వివాదం క్రియేట్ చేయడం ఉచితంగా మీడియాని ఉపయోగించుకోవడం రామ్ గోపాల్ వర్మకు వెన్నతో పెట్టిన విద్య. ఇటీవల `లక్ష్మీస్ ఎన్టీఆర్` రిలీజ్ సందర్భంగా కాంట్రవర్శీ ప్రెస్ మీట్ల గురించి తెలిసిందే. లక్ష్మీస్ ఎన్టీఆర్ అన్న టైటిల్ తోనే వివాదానికి ఆజ్యం పోసిన వర్మ ఏపీ రిలీజ్ కి బ్రేక్ పడడంతో బెజవాడ సాక్షిగా బోలెడంత రచ్చ చేశారు. అయినదానికి కానిదానికి నానా రచ్చ చేస్తూ మీడాయాని రచ్చకీడ్చారు. అవసరం ఉన్నా లేకపోయినా వివాదాల్ని కోరుకునే మీడియా కూడా అంతే వేలంవెర్రిగా అతడి వెంట పడి లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రచారంలో పోటీపడింది. ఇది కేవలం లక్ష్మీస్ ఎన్టీఆర్ వరకే పరిమితం కాదు. ఆర్జీవీ తెరకెక్కించే ఏ సినిమాకి అయినా.. ఆయన ప్రచారం కోరుకునే ఏ ఇతరుల సినిమాకి అయినా వర్తించే రెగ్యులర్ ప్రాసెస్ ఇది.
అయితే ఇలా అవసరానికి మీడియాని వాడుకోవడం తప్పా కాదా? అలా చేయడం ఆర్జీవీ తప్పా.. లేక అతడి వెంట పడే మీడియాదే తప్పు అనాలా? దీనిపై రెగ్యులర్ గా సినీ మీడియాలో ఆసక్తికర చర్చ సాగుతూ ఉంటుంది. అసలు ప్రచారం చేసుకోవడంలో గురువు గారు ఆర్జీవీ వైపు నుంచి అస్సలు తప్పే లేదన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన శిష్యుడు జేడీ చక్రవర్తి తనను వెనకేసుకు రావడం ఆసక్తిని రేకెత్తించింది. ``ఆర్జీవీ సెన్సేషన్స్ చేయరు.. మీడియానే చేస్తుంది!`` అనీ జేడీ అన్నారు. ఆయన యథాలాపంగా ఆ మాట అన్నా కానీ అది మీడియాపై పంచ్ లాంటిదే. ఆ మాటకు అర్థం.. మీడియాకే దురదెక్కువ! అన్నట్టుగానే ఉంది. నిజమే అయినదానికి కానిదానికి ఆర్జీవీ వెంటపడేది మీడియానే. ఆర్జీవీ కావాలని పిలిచారా ఏనాడైనా? పిలిచినంత మాత్రాన మీడియా వెళ్లిపోవడమేనా?
మీడియా మసాలా లేనిదే బతకలేదు! అన్న వీక్ పాయింట్ ని ఆర్జీవీ తెలివిగా ఉపయోగించుకుంటున్నారు అంతే! విషయం తెలిసీ మీడియా అతడి కి పరోక్షంగా ప్రచార సాయం చేస్తోంది. జేడీ గురువుపై ప్రేమతో అన్నావాస్తవమే మాట్లాడాడు. అంతేకాదు .. ప్రస్తుతం ఆర్జీవీ రేసులో వెనకబడడంపైనా జేడీ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. సెంచరీ చేయనంత మాత్రాన సచిన్ ని సచిన్ కాదని అంటామా.. గతాన్నిచూడాలని జేడీ అన్నారు. మునుముందు తాము ఫామ్ లోకి వస్తామన్న ఆశాభావం వ్యక్తం చేయడం ఆశ్చర్యం కలిగించింది. హిందీ కెరియర్ జీరో అయ్యింది? అన్న ప్రశ్న వేస్తే.. సర్వీస్ స్టేషన్ అక్కడా ఇక్కడా మూవ్ అవుతోంది. ఇక్కడ సరైన ఛాన్సులు లేనప్పుడు ముంబై వెళుతున్నానని జేడీ తెలిపారు. ప్రస్తుతం తెలుగు-తమిళం- మలయాళంలో నటిస్తున్నానని.. అయితే ఎగ్జయిట్ చేసిన క్యారెక్టర్ వస్తేనే చేస్తున్నానని జేడీ తెలిపారు. హిప్పీ చిత్రంలో పాత్ర తనని ఎంతో ఎగ్జయిట్ చేసిందని తెలిపారు. జేడీ - కార్తికేయ ప్రధాన పాత్రలు పోషించిన హిప్పీ జూన్ 6న రిలీజవుతున్న సంగతి తెలిసిందే.