కొద్ది గ్యాప్ తర్వాత జేడీ చక్రవర్తి మళ్లీ తెలుగు సినిమాలో కనిపించాడు. కార్తికేయ హీరోగా నటించిన 'హిప్పీ' మూవీలో జేడీ చక్రవర్తి కీలక పాత్రలో నటించాడు. ఇటీవలే ఆ చిత్రం విడుదలైంది. సినిమా ఫలితం ఫలితం తేడా కొట్టింది. ఆ విషయాన్ని పక్కన పెడితే ఆ చిత్ర ప్రమోషన్ సమయంలో జేడీ చక్రవర్తి పలు విషయాలను వెళ్లడించాడు. గతంలో జరిగిన పలు విషయాలను నెమరవేసుకుని తెలుగు ప్రేక్షకులను ఆశ్చర్యంలో ముంచెత్తాడు.
తాజాగా గతంలో జరిగిన మరో విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. శ్రీదేవి చెల్లి మహేశ్వరితో కలిసి 'గులాబీ' చిత్రంలో నటిస్తున్నాను. ఆ సమయంలో మహేశ్వరి చెన్నైలోని శ్రీదేవి గారి ఇంట్లో ఉంటున్నారు. వాళ్ల అమ్మగారు కూడా చెన్నైలోని ఇంట్లోనే ఉంటారు. ఒకరోజు నన్ను లంచ్ కోసం మహేశ్వరి ఆహ్వానించింది. శ్రీదేవి గారి ఇంటికి నేను వెళ్లాను. వెళ్లిన కొద్ది సేపటి తర్వాత శ్రీదేవి గారి తల్లి గారు నా వద్దకు వచ్చి నా కూతురును పెళ్లి చేసుకోమంటూ కోరడం జరిగింది. అప్పుడు నేను షాక్ అయ్యాను. అప్పటికే శ్రీదేవి గారికి పెళ్లి అయ్యింది. శ్రీదేవి తల్లి గారికి మెదడులో చిన్న ఆపరేషన్ జరగడంతో కొన్ని విషయాలు మర్చి పోవడంతో పాటు కొన్ని విషయాలు పదే పదే అంటూ ఉంటుంది.
శ్రీదేవి గారిని పెళ్లి చేసుకోమంటూ వారి తల్లిగారు నన్ను అడిగిన విషయాన్ని వర్మకు చెబితే హర్ట్ అయ్యాడు. ఆవిడ నన్ను అడిగి ఉండవచ్చు కదా అంటూ ఎటకారం ఆడేవాడు. వర్మకు ఎంతగా శ్రీదేవి గారు అంటే అభిమానమో నాకు అంతే అభిమానం. ఆవిడ విషయంలోనే మా ఇద్దరికి అప్పుడప్పుడు గొడవలు అయ్యేవి. అంతకు మించి మా మద్య ఎలాంటి విభేదాలు ఎప్పుడు తలెత్తలేదు అంటూ జేడీ చెప్పుకొచ్చాడు.
Full View