సీనియర్ ఆర్టిస్ట్ 'జీవా' పేరు వినగానే చింతనిప్పుల వంటి ఆయన కళ్లు గుర్తుకు వస్తాయి. తెరపై ఆయన కనిపించేలా చేసినవే ఆయన కళ్లు. ఆ కళ్ల వల్లనే ఆయనను వెతుక్కుంటూ విలన్ పాత్రలు వచ్చాయి. ఆ తరువాత ఆయన తన విలనిజానికి కామెడీ టచ్ ఇస్తూ నవ్వించడంలోనూ సక్సెస్ అయ్యారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీ అయ్యారు. తెలుగు తెరకి ఎంతమంది కొత్తవాళ్లు వస్తున్నప్పటికీ, తనదైన ప్రత్యేకస్థానం తనకి ఉండేలా చూసుకున్నారు. అలాంటి జీవా తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమం ద్వారా తన కెరియర్ కి సంబంధించిన అనేక విషయాలను పంచుకున్నారు.
"నా పేరు దయారత్నం .. జీవా పేరుతో వెండితెరకి పరిచయం అయ్యాను. మొదటి నుంచి కూడా నాకు నటన అంటే ఇష్టం. 1975లో 'స్వర్గం నరకం' సినిమా కోసం నన్ను పిలిపించారు. స్క్రీన్ టెస్టు చేసి .. ఏ విషయం తరువాత చెబుతామని అన్నారు. అక్కడున్న వాళ్లంతా ఆ అవకాశం నాకే వస్తుందని అన్నారు. ఆ తరువాత నేను మా ఊరుకి వచ్చేశాను. అక్కడి నుంచి ఎలాంటి కబురు రాలేదు. నేను కనుక్కుంటే ముందుగా నన్ను అనుకున్న పాత్రలో 'మంచు భక్తవత్సలం నాయుడు'(మోహన్ బాబు) అనే కుర్రాడిని తీసుకున్నట్టు చెప్పారు. ఓ కాలేజ్ కుర్రాడి పాత్ర ఉంది .. వీలైతే అది చేయండి అన్నారు. ఆ మాటలకు నాకు చాలా నిరాశ కలిగింది.
'మంచు భక్తవత్సలం నాయుడు' ఎవరా చూద్దాం అని ఆఫీసుకి వెళ్లాను. బొట్టు పెట్టుకుని చూడటానికి బ్రహ్మాండంగా ఉన్నాడు. హైటూ .. గియిటూ చూసి ఓహో .. నాకంటే ఇతగాడే కరెక్ట్ అనుకున్నాను. మా సొంతఊరు గుంటూరుకి వెళ్లిన తరువాత, కె. బాలచందర్ గారు 'తొలికోడి కూసింది' సినిమా కోసం ఆర్టిస్టులు కావాలని పేపర్లో ప్రకటన ఇచ్చారు. ఫొటోలు పంపించమంటే పంపించాను. నేను సెలెక్ట్ అయినట్టుగా టెలిగ్రామ్ పంపించారు. అక్కడి నుంచి నటుడిగా నా ప్రయాణం మొదలైంది. అలా నన్ను నటుడిని చేసిన బాలచందర్ గారి పేరే మా అబ్బాయికి పెట్టాను. అందుకోసం ఆయన అనుమతి అడిగినప్పుడు .. సంతోషంగా అంగీకరించారు" అని చెప్పుకొచ్చారు.