ఏపీలో కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... పాలనలో తనదైన స్పీడును చూపిస్తున్నారు. ఈ స్పీడు ఎంత వేగంగా ఉందంటే... ఏ ఒక్కరు కూడా అందుకోలేనంతగా. సింగిల్ స్టెప్ లోనే పూర్తి స్థాయి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకున్న జగన్... రాష్ట్రంలోని పలు నామినేటెడ్ పదవుల భర్తీని కూడా కొనసాగిస్తున్నారు. ఈ నియామకాల విషయంలో జగన్ చాలా నెమ్మదిగానే వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నా... జగన్ మాత్రం తనదైన దూకుడునే ప్రదర్శిస్తున్నారని చెప్పక తప్పదు. ఇప్పటికే చాలా పదవులను భర్తీ చేసేసిన జగన్... సినీ ఇండస్ట్రీకి చెందిన ఏపీ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గిరీని ఎవరికి కట్టబెడతారన్న విషయంపై ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతోంది.
ఈ పదవిని ఆశిస్తున్న వారితో పాటు - అవకాశం ఉందన్న వారి జాబితా చాలా పెద్దగానే ఉన్నా.. ఇప్పుడు కేవలం రెండంటే రెండు పేర్లే వినిపిస్తున్నాయి. వాటిలో ఒకటి దివంగత సీఎం వైఎస్ హయాంలోనే ఎమ్మెల్యేగా ఎన్నికైన సీనియర్ నటి జయసుధ కాగా... పలు రాజకీయ పార్టీలు మారి చివరకు వైసీపీలో స్థిరపడినట్టుగా కనిపిస్తున్న జీవితా రాజశేఖర్ పేర్లు మాత్రమే ఈ రేసులో ఉన్నాయట. ఇటీవల ముగిసిన ఎన్నికలకు ముందు సినీ ఇండస్ట్రీకి చెందిన చాలా మంది వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. వారిలో జగన్ కు మామ వరస అయ్యే మంచు మోహన్ బాబుతో పాటు కమెడియన్ అలీ - జీవితా రాజశేఖర్ దంపతులు, జయసుధ తదితరులుండగా... ఎన్నికలకు చాలా ముందే కేరెక్టర్ ఆర్టిస్టులు పృధ్వీరాజ్, కృష్ణుడు పార్టీలో కీలకంగానే ఉన్నారు.
అయితే నాలుగు రోజుల క్రితమే పృధ్వీరాజ్ కు ఎస్వీబీసీ చైర్మన్ పదవిని అప్పగించిన జగన్... మోహన్ బాబు - అలీలకు కూడా పదవుల మీద ఆశ పెట్టుకోవద్దన్న సంకేతాలను పంపినట్లుగా ప్రచారం జరుగుతోంది. మోహన్ బాబు వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనంగా చెప్పుకొోవాలి. ఇలా సినీ ఇండస్ట్రీకి చెందిన వైసీపీ నేతలంతా సైడైపోగా... జయసుధ - జీవితలు ఇద్దరు మాత్రమే మిగిలారట. మరి వీరిలో ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఎవరిని వరిస్తుందన్న విషయంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. జయసుధ - జీవిత.. ఇద్దరూ వైసీపీ నుంచి బయటకు వెళ్లి మళ్లీ తిరిగి వచ్చిన నేతలే. సీనియారిటీ పరంగా చూస్తే జయసుధకు, వ్యవహార పరంగా చూస్తే జీవితకు ఈ పదవి దక్కే అవకాశాలు ఉన్నాయంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. చూద్దాం... మరి జగన్ ఈ పదవిని ఎవరికి కట్టబెడతారో?